Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ స్పీకర్ శ్రీ పద్మారావు గౌడ్
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని, వాటి ఫలి తాలు ప్రతి ఇంటికీ దక్కేలా చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. తార్నాక మున్సిపల్ డివిజన్ పరిధిలో కల్యాణ లక్ష్మి చెక్కులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, బీఆర్ఎస్ యువ నేత రామేశ్వర్ గౌడ్, బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి, అధికారులు, నేతలతో కలిసి ఆయన ఇంటింటికీ తిరుగుతూ అందించారు.ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ. సికిం ద్రాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శ వంతంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. తమతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలకు నేరుగా ప్రజలతో సంబంధాలు ఉన్నాయన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల్లో ఎవరికీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు అడిగితే సితాఫలమండీలోని తమ క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.