Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
వైద్యుల నిర్లక్ష్యం వల్ల పసికందు మృతి చెందింది. ఈ ఘటన నాంపల్లి కృష్ణ ఉమెన్, చిల్డ్రన్ హాస్పిటల్లో సోమవారం జరిగింది. సిద్దిపేటకు చెందిన మల్లేశం 2 నెలల బాబు నిమోనియా సమస్యతో 15 రోజుల క్రితం కృష్ణ హాస్పిటల్ చేరారు. 3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామన్న వైద్యులు 15 రోజులు గడిచాక బాబు మృతి చెందినట్టు చెప్పారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బాబు మృతి చెందాడని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. బాబు మృతికి కారణమైన హాస్పిటల్ యాజమాన్యం వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.