Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్‌మెట్
దేశంలో ఎక్కడా లేని కనీవిని ఎరగని సంక్షేమ పథకాలు తెలంగాణలోనే అమలవుతున్నాయని ముషీరా బాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ అన్నారు. సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగూడ డివిజన్ ఆర్ కన్వెన్షన్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, సాయి కిరణ్ యాదవ్ బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు గడపగడపకూ తీసుకెళ్లాల న్నారు. కేసీఆర్‌ను ప్రధాని చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విభేదాల ను పక్కన పెట్టి నాయకులంతా ఒకే తాటిపైకి వచ్చేందు కు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు ఎంతగానో దోహదప డతాయన్నారు. రైతులకు, దళితులకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే రాబోవు ఎన్నికల్లో బీఆర్ ఎస్‌ను అధికారంలోకి తీసుకురావాలన్నారు. దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. నియోజవర్గంలో డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలను నిర్మించుకొనున్నట్టు తెలిపారు. కేంద్రంపై గట్టిగా మాట్లాడితే ఈడీ కేసులతో ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీ హౌదాలో ముషీరాబాద్ నియోజక వర్గానికి ఒక్క రూపాయి నిధులను తేలేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ముఠా జై సింహ, కవాడిగూడ డివిజన్ అధ్యక్షుడు శ్యామ్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు రవీందర్, ముఠా పద్మ, బీఆర్ఎస్ నాయకులు సాయి కిరణ్, ఎస్.యాదగిరి, షరిఫుద్దిన్, లూక్, కల్వ గోపి, మాధవి, పద్మజ, వల్లాల శ్రీనివాస్ యాదవ్, కార్తీక్ యాదవ్, దుర్గస్వామి, విక్కి, ప్రభాకర్, ముకుంద్ రెడ్డి, చంద్రశేఖర్, వేణు, పలు డివిజన్ల అధ్యక్షు లు రాకేష్ కుమార్, ఆర్.మోజెస్, ప్రధాన కార్యదర్శులు ఆకుల అరుణ్, సాయికిరణ్, కరిక కిరణ్ కుమార్, బల్వీర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.