Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ
నవతెలంగాణ-అడిక్మెట్
టీఎస్పీఎస్సీని వెంటనే రద్దు చేసి ప్రభుత్వ ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయం లేని స్వతంత్ర సంస్థల ద్వారా ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ అన్నారు. సోమ వారం విద్యానగర్ బీసీ భవన్లో బీసీ నాయకుల సమా వేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన వారం రోజుల నుంచి టీఎస్పీఎస్సీ లీకేజీ అంశం విచారణలో సీట్ కేవలం కొంతమంది పాత్రధారుల, రాజకీయ నేతల విచారణతో సమయం వృధా చేస్తుందే తప్ప అసలైన నింధితులు, కుట్రదారులు మూల దోషుల విచారణకు ప్రయత్నం చేయడం లేదన్నారు. గత నియామకాల్లో ఎస్సై కానిస్టేబుల్ నుంచి 2016 గ్రూప్ 1 వరకు అవకతవకలు అక్రమాలు జరిగాయని తెలిపారు. రాజ్యాంగబద్ధతో, స్వతంత్య ప్రతిపత్తితో ఏర్పడిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ గత ఆరు నియామక ప్రక్రియల్లో లీకేజీలు, అక్రమాలు అవకతవకలు జరుగు తుంటే అందుకు ప్రభుత్వ పెద్దలే సూత్రదారులని వార్తలు వస్తుంటే, ప్రభుత్వ డైరెక్టు నియామక సంస్థలైన పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, వైద్య విద్యా నియమక బోర్డు, ఎలక్ట్రిటిసిటి నియామక బోర్డు, గురుకుల నియామక బోర్డుల నియామకాలు సక్రమంగా జరుగుతాయని ఎలా నమ్మాలి అని ప్రశ్నించారు. ఇలాంటి అన్ని బోర్డులు, ఆ నియామకాలు, పద్దతులు వెంటనే రద్దు చేసి, స్వయం ప్రతిపత్తి గల సంస్థలతో మాత్రమే నియామకాలు జరిపే పద్ధతులను ప్రవేశ పెట్టాలని డిమాండు చేశారు. ఈ సమావేశంలో నీల వెంకటేష్, పి.సుధాకర్ ముదిరాజ్, రాజేందర్, అనంతయ్య, రాంబాబు పాల్గొన్నారు.