Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2020 జూన్ 2 వరకు కట్టుకున్న వారికి అవకాశం
- ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- 58, 59 జిఓ లపై అధికారులతో సమీక్ష
నవతెలంగాణ-మీర్పేట్
ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్న వారు రెగులరైజ్ చేసుకోవటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మరొక అవకాశం కల్పించారని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం మీర్ పేట్ కార్పొ రేషన్ పరిధిలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి రెవెన్యూ అధికా రులతో 58, 59 జిఓ లకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో 2014 వరకు కట్ ఆఫ్గా ఉండగా తాజాగా 2020 జూన్ 2 వరకు కట్టుకున్న వారికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వచ్చే నెల ఏప్రిల్ 1వ తేదీ నుంచి 58,59 జిఓ లకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారం భం అవుతుందని మంత్రి తెలిపారు. నోటరీ, ఇతరత్రా ప్లాట్లపైన కూడా ఇది వర్తిస్తుందని తెలిపారు. అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గంలో 58 జీఓ ద్వారా 966 మంది లబ్దిదారులకు హక్కులు కల్పించినట్టు, త్వరలో వాటిని పంపిణీ చేస్తామన్నారు. ఏప్రిల్ 1 నుంచి 30 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కందుకూరు ఆర్డీవో సూరజ్ కుమార్, తహశీల్దార్లు జనార్దన్ రావు, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాగోల్ డివిజన్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం
నాగోల్ : నాగోల్ డివిజన్లోని కాత్యాయని ఫంక్షన్ హాలులో బీఆర్ఎస్ నాగోల్ డివిజన్ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి ఆధ్వర్యం లో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదేవి ధంగా కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, కార్పొరేషన్ చైర్మెన్లు ఉప్పల శ్రీనివాస గుప్త, అమరవాది లక్ష్మీనారాయణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో ఆలోచిస్తూ రాష్ట్ర అభివృద్ధి ,ప్రజాసంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం లభిస్తుందన్నారు. ప్రజాసంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించి బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా ఎల్బీనగర్ నియోజక వర్గాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లడం జరిగిందన్నారు. నాగోల్ డివిజన్లో దేశంలోనే ఎక్కడా లేని విధంగా మూడు మతాలకు ఒకే చోట ముక్తి ఘాట్ ను ఏర్పాటు చేసుకోవడం, ట్రాఫిక్ సమస్యలను నియంత్రించేం దుకు గాను నూతనంగా ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేసుకోవడం జరిగిం దని పేర్కొన్నారు. అలాగూ నాగోల్ డివిజన్లో వర్ష కాలం లో ముంపునకు గురవుతున్న తరుణంలో బండ్లగూడ చెరువు నుంచి నాగోలు చెరువుకు నాగోల్ చెరువు నుంచి మూసీ నదికి బాక్సు డ్రయినేజీని నిర్మాణం చేయడం జరిగిందని తెలిపారు. కార్యకర్తలు సమిష్టిగా, సమన్వయంతో మెలుగుతూ పార్టీ బలోపే తానికి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
బడంగ్పేట్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం
బడంగ్పేట్ : బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్లో ఆదివారం రాత్రి బడంగ్ పేట్ కార్పొరేటర్లు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం పార్టీ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరై మాట్లా డుతూ సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ఆత్మీయ సమ్మేళన కార్యక్ర మాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కేసీఆర్ ఒక విజన్ ఉన్నటువంటి మహా నాయకుడని, నిరుపేద కుటుంబాలకు ఎప్పుడు ఏ పథకాల ద్వారా లబ్ది చేకూర్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. సంక్షేమ పథకాలను కింది స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన అవసరం ప్రజా ప్రతినిదులు, అధికారులపై ఎంతైనా ఉందన్నారు.ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా డివిజన్ల అభివద్ధి, ఆత్మీయ అభిమానం మరింత ప్రజలకు దగ్గర అవడానికి దోహద పడుతుందని, ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి కూడా తోడ్పడుతుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపే తానికి బాటలు వేయాలని ,ప్రతీ డివిజన్ పరిధిలో ఆత్మీయ సమ్మేళ నం కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మెన్ శ్రీధర్, కార్పొరేటర్లు పి.శోభా ఆనంద్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,అర్జున్, బీమిడి స్వప్న జంగారెడ్డి, లిక్కి మమత కృష్ణారెడ్డి,గుర్రం స్వప్న వెంకట్ రెడ్డి,వివిధ డివిజన్ల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, మహిళలు,కార్యకర్తలు, అభిమా నులు తదితరులు పాల్గొన్నారు.