Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.236 కోట్లతో పీర్జాదీగూడ బల్దియా 2023-24 అంచనా బడ్జెట్
- నిరంతర నీటి సరఫరాకు అధిక ప్రాధాన్యం
- పన్నుల ద్వారా రూ.52 కోట్లు రాబడి..
- రూ.184 కోట్లు ప్లాన్, నాన్ ప్లాన్ గ్రాంట్లు వస్తాయని అంచనా..
- అభివద్ధి, సంక్షేమం లక్ష్యంగా వార్షిక బడ్జెట్ : మేయర్ జక్క వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
నగరంలో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తూ మేయర్ జక్కావెంకట్ రెడ్డి రూ.236 కోట్ల భారీ పద్దుతో ప్రవేశపెట్టిన పీర్జాదిగూడ బల్దియా 2023-24 సంవత్సర అంచనా బడ్జెట్ కు ఏకగ్రీవంగా కౌన్సిల్ ఆమో దం తెలిపింది. మేయర్ అధ్యక్షతన సోమవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో బడ్జెట్ను సభ ముందుంచారు. ప్రతిపాదించిన పద్దులో రూ.52. 58 కోట్లు ఆస్తి పన్నులు, భవన నిర్మాణ అనుమతుల ఫీజుల రూపేనా కాగా రూ.183.71 కోట్లు ప్లాన్, నాన్ ప్లాన్, గ్రాంట్లు ఇతర గ్రాంట్లు వస్తాయని భారీ ఆశలతో అంచనా వేశారు. వీటిలో ప్రధానంగా 24 గంటల నీటి సరఫరాకు సంబంధించి రూ.55 కోట్లు ప్రభుత్వం నుంచి వస్తాయని అంచనాలు రూపొందించారు. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 40 లక్షల లీటర్ల నీరు సరఫరా అవు తుండగా నిరంతరం 24 గంటలు పాటు నీటి సరఫరాకు రూ.55 కోట్లు వ్యయం ప్రభుత్వం నుంచి వస్తాయని అంచనా వేశారు. ఈ మొత్తంతో కార్పొరేషన్లో మిషన్ భగీ రథ ఫేస్ 2లో భాగంగా నగర పరిధిలో తాగు నీటి సమస్యలేకుండా ఇప్పటికే 90 లక్షల లీటర్ల కెపాసిటి కలిగిన రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని తద్వారా రానున్న కాలంలో 24 గంటలు మంచి నేటి సరఫరా కు వీలు కలుగు తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వేసవిలో తాగునీటి నమస్య లేకుండా క్రమంతప్పకుండ మంచినీరు సరఫరా చేసి, అవసరమైన చోట కొత్త పైప్ లైన్తో పాటు జంక్షన్ నిర్మించడం, వరద ముంపునకు శాశ్వత పరిష్కారానికి సుమారు రూ. 110 కోట్లతో ఎస్ఎన్డీపీ నిధులతో నిర్మిస్తున్న స్ట్రోం వాటర్ డ్రైన్ పనులు చురుగ్గా సాగుతున్నాయని ఈ వర్షాకాలం నాటికి పనులు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
వీధి వ్యాపారులకోసం ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్న ''స్ట్రీట్ వెండింగ్ జోన్ '' త్వరగా పూర్తి చేసి అర్హులైన వారికి అందించడం జరుగుతుందని తెలిపారు. పీర్జాదిగూడ కమాన్ నుంచి ప్రతాప్ సింగారం క్రాస్ రోడ్ వరకు సుమారు 25.36 కోట్లతో నిర్మిస్తున్న 4 లైన్ రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయని త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేనున్నామని తెలిపారు.చెరువుల సుందరీకరణలో భాగంగా సుమారు రూ.13 కోట్లతో పీర్జాదిగూడ పెద్ద చెరువు మైనర్ ట్యాంక్ బండ్ మాదిరిగా అభివద్ది చేస్తున్నామని త్వరలోనే పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవడం జరుగుతుందన్నారు.
నగర పరిదిలో ఆహ్లదకరమని వాతావరణం అందిం చడానికి మరిన్ని మోడల్ పార్కలను నిర్మించనున్నట్లు తెలిపారు. సుమారు రూ 7.5 కోట్లతో నిర్మిస్తున్న సమీకత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. దోమల నివారణకు అవసరమైన కొత్త ఫాగింగ్ మిషన్లను కొనుగోలు చేయడం జరిగిందని వాటి ద్వారా ప్రతీ రోజు వీధులలో ఫాగింగ్ చేస్తున్నామని అదేవిదంగా దోమల గుర్రపు డెక్క తొలగించడానికి డ్రోన్ సహాయంతో క్రిమి సంహారక మందులతో పాటు యాంటి లార్వా మందు లు పిచికారీ చేస్తున్నామని తెలిపారు. కుక్కల, పందుల, కోతుల నివారణకు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని వాటిని అవలంభించాల్సిన ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిం దన్నారు. ప్రత్యేకంగా ఆపరేషన్ చేయబడిన కుక్కలకు గుర్తించుటకు వాటి మెడకు బెల్ట్ వేస్తున్నామని తెలిపారు. నగర పరిధిలో వేసవిలో మూగ జీవాల దాహార్తిని తీర్చడం కోసం ప్రత్యకంగా నీటి తోట్లు ప్రతి డివిజన్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. నగరాన్ని మరింత అభివద్ధి చేయడంలో కార్పొరేటర్లు, కో ఆప్షన్ సబ్యులు, అధికారులతో కలిసి సిది ్దపేట, సిరిసిల్ల పట్టణాలకు స్టడీ టూర్ తీసుకెళ్లడం జరుగు తుందన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు బోడిగే స్వాతి, తూంకుంట్ల ప్రసన్న లక్మ్షీ,బండారి మంజుల, ఎల్. మాధవి, కో ఆప్షన్ సభ్యురాలు సీహెచ్ వరలక్ష్మిలు పాల్గొన్నారు.