Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ ఉపాధ్యక్షులు వేము నరేందర్ రెడ్డి
నవతెలంగాణ - మీర్పేట్
దేశ సంపదను నాడు బ్రిటిష్ వారు కొల్లగొడితే నేడు బీజేపీ కార్పొరేట్లకు దోచిపెడుతున్నదని టీనీపీపీ ఉపాధ్య క్షులు వేము నరేందర్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడానికి నిరసనగా రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి ఆధ్వ ర్యంలో జిల్లెలగూడలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు సత్యాగ్రహ సంకల్ప దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వేము నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం కులమతాల పేరుతో కుట్రలు చేస్తూ దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. పేద మధ్యతరగతి ప్రజలపై నిత్యవసర వస్తువుల ధరలను పెంచుతూ నడ్డి విరుస్తున్నదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నాడని అక్కసుతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో దేశ సంపదను పెంచుతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంక్షేమ ఫలాలను అందించిందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ పైన పెట్టిన కేసును, పార్ల మెంట్ సభ్యత్వం రద్దు చేయడానికి వెనక్కి తీసుకోవాలని లేనియెడల వచ్చే ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సీని యర్ వైస్ ప్రెసిడెంట్ మల్రెడ్డి రంగారెడ్డి, అధికార ప్రతినిధి సంకేపల్లి సుధీర్ రెడ్డి, మల్ రెడ్డి రామ్ రెడ్డి, జ్ఞానేశ్వర్ ముది రాజు, అమరేందర్ రెడ్డి, దేపా భాస్కర్ రెడ్డి, జితేందర్, పీసీ సీ కార్యదర్శి చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, మాజీ జెడ్పీ ప్లోర్ లీడర్ ఏనుగు జంగారెడ్డి శేఖర్ గౌడ్ శివకుమార్, పీసీ సీ కార్యదర్శి బంగారు బాబు, సామిడి గోపాల్ రెడ్డి, జయ మ్మ, సిద్ధాల శ్రీశైలం, చల్ల బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.