Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిమ్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ)
నవతెలంగాణ-సిటీబ్యూరో
బీజేపీ9 ఏండ్ల పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని సీిఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ అన్నారు. పంజాగుట్ట నిమ్స్ హాస్పటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు నిమ్స్ యాజమాన్యానికి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 2021 ఏప్రిల్ 1 నుంచి వీడిఏ పాయింట్లు అమలు చేయాలని, ఏరియర్స్ డబ్బులు ఇవ్వాలని, సీనియార్టీ ప్రకారం కార్మికులను పర్మినెంట్ చేయాలని, నిమ్స్ హాస్పటల్లో పనిచేస్తూ రిటైర్ అయిన కార్మికులకు ఉచితంగా వైద్యం చేయాలని ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ నిమ్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మధ్యాహ్నం జనరల్ బాడీ సమావేశం నిమ్స్ హాస్పటల్లో జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్, నిమ్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు ఎం వెంకటేష్ మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ 9 సంవత్సరాల పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డదని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీి పాలన ఒక ఫాసిస్టు పద్ధతిలో దేశంలో కొనసాగుతున్నదని అన్నారు. మోడీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్లను సీబీఐ ఈడీి ఐటి సంస్థలను దుర్వినియోగం చేసి వేధించడం జరుగుతున్నది. అదానిని కాపాడడం కోసం రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారని అన్నారు. కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టిన అదానిపై ఈడీి, సీబీఐ, ఐటి సంస్థలు ఎందుకు కేసులు పెట్టట్లేదని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం హాయంలో బీజేపీలో ఉన్న వాళ్లకి ఒక న్యాయం, ప్రజలకు, ప్రతిపక్షాలకి ఒక న్యాయం లాగా తయారయిందని అన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్ 5వ తేదీన సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని హైదరాబాదులో ఉన్న కార్మికవర్గం జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపు ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం కార్మికులకు సంబంధించిన 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లు మార్చి 8 గంటల పనిదినం స్థానంలో 12 గంటల పనిని ప్రవేశపెట్టింది. కార్మికులను ఎప్పుడంటే అప్పుడు తొలగించే స్వేచ్ఛను యజమానులకు అప్పగించి అదాని, అంబానీ వంటి కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తున్నది. కార్మిక వర్గాన్ని నట్టేట ముంచుతున్నది. ఇప్పటికే గ్యాస్, పెట్రోలు, డీజిల్, నిత్యావసర సరుకులు ధరలు పెంచి పేదవారి నడ్డి విరిచింది. ప్రభుత్వ రంగంలో ఉన్న ఎల్ఐసి, బ్యాంకులు, రైల్వే తదితర సంస్థలను నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతో ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా కట్టబెడు తున్నది. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులను నట్టేట ముంచుతు న్నది. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలని విద్యుత్ సవరణ బిల్లులో పెట్టి రైతాంగానికి ద్రోహం చేస్తున్నది. తన ప్రజా వ్యతిరేక విధానాలను మరుగునపరచడానికి ప్రజల మధ్య కులం పేరుతో, మతం పేరుతో ఘర్షణ సష్టించి తన పబ్బం గడుపుకుంటున్నది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలో ఎండగట్టాలని సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 5వ తేదీన ఢిల్లీలో జరుగుతున్న కార్మిక, కర్షక, సంఘర్ష్ ర్యాలీ జరుగుతున్న ఈ సందర్భంగా హైదరాబాదులో ఉన్న అన్ని కార్మిక కేంద్రాలలో యూనియన్లలో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నరేంద్రమోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఆందోళనా, పోరాటాలు నిర్వహించాలని పిలు పు ఇచ్చారు. సెక్రెటరీ ఈ.నర్పింహా తదిరులు పాల్గొనారు.