Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎయిర్పోర్టు మెట్రో కోసం భూసామర్థ్య పరీక్షలు ప్రారంభించాం : ఎండీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఐకియా జంక్షన్ నుంచి శంషాబాద్ అంతర్జా తీయ విమానాశ్రయం వరకు చేపట్టే మెట్రో ప్రాజెక్టు కోసం భూసామర్థ్య పరీక్షల (సాయిల్ టెస్టింగ్)ను సోమవారం ప్రారంభించినట్టు హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఎయిర్ పోర్ట్ మెట్రో పనుల కోసం సోమవారం భూసామర్థ్య పరీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎయిర్పోర్టు ప్రాజెక్టు కోసం అలైన్మెంట్ స్థిరీకరణ, పెగ్ మార్కింగ్ పనులు ఇప్పటికే పూర్తిచేశామన్నారు. ఐకియా జంక్షన్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు చేపట్టే మెట్రో పనుల కోసం దాదాపు 100 మెట్రో పిల్లర్లను నమూనాగా తీసుకుని భూసామర్థ్య పరీక్షలు చేట్టామన్నారు. ఈ పనులు పూర్తి కావడానికి సుమారు రెండు నెలల సమయం పట్టవచ్చని చెప్పారు. మెట్రో పిల్లర్స్ వేసే ప్రతిచోట భూమి ఉపరితలం నుంచి సుమారు 40 అడుగుల లోతు వరకు తవ్వి అక్కడికక్కడే పరీక్షలు నిర్వహిస్తా మని, మరికొంత మట్టి నమూనాలను పరీక్షలు పంపించడం జరుగుతుం దన్నారు. రెండు నమూ నాల పరిశీలించన తర్వాత భూ సామర్థ్యాన్ని నిర్ణయి స్తామని తెలిపారు. దాంతో టెండర్లలో పాల్గొనే బిల్డిర్ల కు ప్రాజెక్టుపై అంచనా వస్తుందన్నారు. భూసా మర్థ్య పరీక్షలు నిర్వహి స్తున్న ప్రాంతాలల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, బారికేడ్లను ఏర్పాటు చేస్తామన్నారు. ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ, వాటర్బోర్డు తదితర ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనులు పూర్తి చేస్తామని తెలిపారు. చీఫ్ప్రాజెక్టు మేనేజర్ బి.ఆనంద్ మోహన్, సూపరింటెండెంట్ ఇంజినీర్ సాయపరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.