Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదర్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు అన్నారు. డివిజన్ పరిధిలోని కృష్ణవేణి కాలనీ, శ్రీరామ్ నగర్, సాయి ప్రశాంత్ నగర్ ఫేజ్ 1 , 2 కాలనీ ల్లో పలు సమస్యలపై చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సిబ్బంది, జలమండలి అధికారులు, కాలనీ వాసులతో కలసి ఆయన సోమవారం పాదయాత్ర చేశారు. ఈ సందర్భం గా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు, కాలనీ లోని డ్రైనేజ్ సమస్య మంచి నీటి సమస్యపై జలమండలి అధికారులు జీహెచ్ ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో పరిశీలించామన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, ప్రజలకు ట్రాఫిక్ రహిత, సుఖవంతమైన, మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానన్నారు. అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామన్నారు. హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి పరిచి ఆదర్శవంతమైన డివిజన్‌గా తీర్చిదిద్దుతానన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ ప్రశాంతి, సూపర్ వైజర్ నరేంద్ర, వాటర్ లైన్ మెన్ సత్యనారాయణ, జీహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, ఎలక్ట్రికల్ లైన్ మెన్ శ్రీనివాస్, స్ట్రీట్ లైట్ లైన్ మెన్ సుధాకర్, కాలనీవాసులు చందు నాయక్, రాజు సాగర్, గోపి, రాజు, దాస్, నాగబాబు, ప్రమోద్, గోవింద్, శ్రీనివాస్, సుమన్, వినోద్, రాజేందర్, మన్మధ, బాబులాల్, రేణుక, లక్ష్మి, ఏలెంద్ర తదితరులు పాల్గొన్నారు.