Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ సింగం ఆంజనేయులు
నవతెలంగాణ-శామీర్పేట
ఆరోగ్యంగా ఉండటానికి చిరు ధాన్యాలు దోహదపడతాయని సర్పంచ్ సింగం ఆంజనే యులు అన్నారు. అంతర్జాతీయ చిరుధా న్యాల సంవత్సరము పురస్కరించుకొని సోమవారం మూడుచింతలపల్లి మండలం లోని లక్ష్మాపూర్ జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస ప్రభాకర్ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడ్ కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ సింగం ఆంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరుధాన్యాల అవశ్యకత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. అంతేగాక చిరుధాన్యాలపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రజాప్రతినిధుల చేతులమీదుగా బహుమతులు అందజేశారు. ఎంపీటీసీ పారుపల్లి నాగరాజు, వార్డు సభ్యులు బాలేష్, యువనాయకులు సాయి శ్రీనివాస్ చారి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, అంగన్వాడి సూపర్వైజర్ రేణుక, అంగన్వాడి టీచర్లు ఎన్ శైలజ, కె వీరమణి, బి.మంజుల, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.