Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ
నవతెలంగాణ - కూకట్పల్లి
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని రాంకీ పెరల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో రూపాయలు ఒక కోటి యాబై లక్షల రూపాయల అంచనావ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణం పనులకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్‌తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ రాంకీ పెరల్ కాలనీ అసోసియేషన్ వారు ఆదర్శంగా నిలిచారని, వారు తమ స్వంత నిధులతో కాలనీలో రోడ్లు ఏర్పాటు చేసుకోవడం చాలా అభినదించదగ్గ విషయం అని, తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఆయన తెలియచేశారు. అదేవిధంగా ఆల్విన్ కాలనీ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాల సంతోషకరం అని, అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, ప్రజలకు ట్రాఫిక్ రహిత, సుఖవంతమైన, మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయశక్తుల కృషి చేస్తానని, అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, పార్క్‌లను అన్ని రకాల మౌలిక వసతులతో, అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో సుందర శోభిత వనాలుగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాంకీ పెరల్ కాలనీ అసోషియేషన్ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.