Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కేపీ వివేకానంద
- శ్రీ సాయి విద్యానికేతన్ హై స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్, స్పోర్ట్స్ డే వేడుకలు
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
విద్యార్థులు చిన్ననాటి నుండే విద్యతోపాటు క్రీడలు శాస్త్ర సాంకేతిక రంగాలలో రాణించి దేశ ప్రతిష్ట ఇనుమడింపజేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సోమవారం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధి మగ్దూంనగర్, భగత్‌సింగ్ మార్గ్‌లో గల శ్రీ సాయి విద్యానికేతన్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన ''గ్రాడ్యుయేషన్ డే'' ''స్పోర్ట్స్ డే'' వేడుకలను ఆయనతోపాటు స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్, ట్రాఫిక్ ఏసీపీ కడాల వెంకటరెడ్డి, మేడ్చల్ జిల్లా ట్రస్మ అధ్యక్షులు కే.రామేశ్వర్ రెడ్డి, సంఘ సేవకులు జితేందర్ రెడ్డిలతో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ద్దేశించి ఆయన మాట్లాడుతూ విద్యార్థుల మనోభావాలకు అనుగుణంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని అప్పుడే వారు అనుకున్న గమ్యాన్ని అవలీలగా సాధిస్తారని తెలిపారు. క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగాలు వస్తాయని, ఆ దిశగా ప్రయత్నించాలని సూచించారు. పాఠశాల చైర్మెన్, కరస్పాండెంట్, మేడ్చల్ జిల్లా ట్రస్మ ఉపాధ్యక్షులు, బిర్రు ఆంజనేయులు మాట్లాడుతూ అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటు బోధిస్తు వారి ఉజ్వల భవితకు పునాదులు వేస్తున్నామన్నారు. తక్కువ ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్యనందిస్తూ ప్రతి సంవత్సరం తమ పాఠశాల విద్యార్థులు మండల, జిల్లా స్థాయిలో చదువులో, క్రీడల్లో ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం రాష్ట్ర స్థాయిలో ఫలితాలు సాధించేం దుకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అనంతరం చిన్నారి విద్యార్థులకు సర్టిఫికెట్లతోపాటు, బహుమతులను వారు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బిర్రు శోభారాణి, పలు పాఠశాలల కరస్పాండెంట్స్ వినోద్ కుమార్ జాదవ్, దయాకర్, నర్సింలు గౌడ్, ప్రవీణ్ రెడ్డి, ఇమ్రాన్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ రషీద్, హజరత్ అలీ, సునీల్, ఉపాధ్యాయులు భాగ్యరేఖ, కృష్ణవేణి, మల్లేశ్వరి, రజిత, ప్రశాంతి, అన్నే ఫాతిమా, లక్ష్మీ ప్రసన్న, సుభాషిని, సాజిత, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.