Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బాలానగర్
కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలో జీఓ నెంబర్ 58 ప్రకారం మూసాపేట సర్కిల్ ఫతేనగర్ డివిజన్ పరిధిలో గత కొంతకాలం నుండి ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్న నిరుపేదలకు వారి స్థలాలను క్రమబద్ధీకరిస్తూ కూకట్పల్లి నియోజకవర్గంలోని 150మంది లబ్ధిదారులకు సోమవారం పట్టాలను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలకు అండగా ఉండే ముఖ్యమంత్రి కేసీఆర్ అని, దశాబ్దాలుగా నివాసం ఉంటున్న లబ్ధిదారులైన నిరుపేద లకు జీవో నెంబర్ 58 ప్రకారం వారికి రెగ్యులరైజ్ చేసి జీవితంపై భరోసా కల్పించిన కేసీఆర్ గొప్ప మహానుభావు డన్నారు. ఎప్పుడూ మానవీయ కోణంలో ఆలోచించే వారికి మాత్రమే ఇటువంటి ఆలోచనలు వస్తాయని, అందుకనే రైతులకు అండగా రైతుబంధు, రైతు బీమా నిరుపేదల ఆడబిడ్డ పెళ్ళికి రూ.1లక్ష 116 అందిస్తూ ప్రతి కుటుంబం లో సంతోషాన్ని నింపే సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. కేవలం సంక్షేమ పథకాలతోనే కాకుండా రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులను తీసుకువచ్చి అనేక మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం, శాంతిభద్రతల విషయంలో రాజీ పడకుండా ఎక్కడకక్కడ పటిష్ట ప్రణాళికలు రచించడం వంటి చర్యలు తీసుకోవడం వల్ల కేవలం 9 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దారని అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, ఎంఆర్ఓలు, గోవర్ధన్, డి.అహల్య తదితరులు పాల్గొన్నారు.