Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
పర్యాటక, అతిథ్య సేవలను అందించడంలో దేశంలోనే ప్రముఖ సంస్థలలో ఒకటైన సదరన్ ట్రావెల్స్ వారణాసిలోని ప్రతిష్టాత్మకమైన కాశీ విశ్వనాథ్ కారిడార్‌లో సదరన్ గ్రాండ్ కాశీ హౌజ్‌తో తన సేవలను విస్తరించింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన భీమాశంకర్ గెస్ట్ హౌస్‌ను ఇటీవల ప్రధాన మంత్రి ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా సదరన్ గ్రాండ్ కాశీ హౌటల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగళవారం సదరన్ ట్రావెల్స్ ఎండీ ఆలపాటి కృష్ణ మోహన్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏ.వీ.ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. ట్రావెల్, టూరిజం పరిశ్రమలో 50 ఏండ్లకు పైగా అను భవం ఉందన్నారు. వ్యక్తిగత విహారయాత్రలు, తీర్థయా త్రలే కాకుండా విమాన టికెట్లు, వీసా, ప్రపంచవ్యాప్తంగా హౌటల్ బుకింగ్స్‌లలో సైతం ప్రయాణీకులకు అనేక రకాల ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు గుర్తు చేశారు. తాజాగా ఈ కొత్త హౌటల్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఏడాదీ వారణాసికి విచ్చేసే లక్షలాది మంది ప్రయాణికులకు ఈ కొత్త హౌటల్ ద్వారా వసతి కల్పించడం జరుగుతుందన్నారు. సదరన్ గ్రాండ్ కాశీ అనేది కాశీ విశ్వనాథ్ ఆలయ కారిడార్ లోపల ఉన్న 18గదులు, 36 డార్మిటరీ పడకల అతిధిగృహమని వివరించారు. ఘాట్‌కు కేవలం 50 మీటర్ల దూరంలో ఉన్న ఈ గెస్ట్ హౌజ్‌లో సెంట్రల్ ఎయిర్ కండీషన్ ఉందన్నారు. ఉచిత వై-ఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నామని తెలిపారు.