Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ నాలుగేండ్లలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని బీజేపీ జీహెచ్ఎంసీ ఫ్లోర్ సెక్రెటరీ, రామ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కే.రవి చారి ఆరోపించా రు. ఒకవేళ చేస్తే ఎక్కడ చేశారో నిరూపించేందుకు బహిరంగ చర్చకు రావాలని లేని పక్షంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. నియోజ కవర్గంలో తాను అభివృద్ధి చేయలేదని నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనన్నారు. సోమవారం కవాడిగూడలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో చేసిన సవాళ్లు బీజేపీ స్వీకరిస్తుందని రవిచారి స్పష్టం చేశారు. మంగళవారం బాగ్లింగంపల్లిలోని కార్పొరేటర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని రాంనగర్, అడిక్మెట్, ముషీరాబాద్, కవాడిగూడ, గాంధీనగర్ డివిజన్లో ఎక్కడి సమస్యలు ఎక్కడే రాజ్యమేలుతున్నాయన్నారు. ముఖ్యంగా డ్రయినేజీ, కల్తీనీరు, దెబ్బతిన్న మ్యాన్ హౌల్స్, పొంగి పొర్లుతున్న డ్రైనేజీ, అధ్వానంగా మారిన రోడ్లు, వెలగని వీధి దీపాలు, వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతు న్నారని వాపోయారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే అమలు చేయాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరు కావడం లేదనీ, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదనీ, ఇందిరా పార్కులో ప్రజలకు స్విమ్మింగ్ పూల్ కట్టిస్తారని కట్టించలేదన్నారు. నియోజకవర్గంలోని హై టెన్షన్ వైర్లను పూర్తిగా తొలగించి అండర్ గ్రౌండ్ కేబుల్ ఇస్తానని అని చెప్పి చేయలేదన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి రూ.1000 కోట్లు తెచ్చానని చెప్పిన ఎమ్మెల్యే అవి ఎక్కడ ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో అధికారుల చేత పనులు చేయించడంలో విఫలమయ్యార ని చెప్పారు. ఆసరా పెన్షన్ కార్డులను ఎమ్మార్వో ఆఫీస్ నుంచి తీసుకొని ఇంతవరకు వాటిని ఇవ్వకుండా బీఆర్ఎస్ కార్యకర్తల ఇంట్లో ఉంచడంతో వృద్ధులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని రవిచారి పేర్కొన్నారు.