Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
సైబర్‌నేరాలపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ జీ.శంకర్రాజు తెలిపారు. మంగళవారం దిల్సుఖ్ నగర్‌లోని సిద్ధార్థ డిగ్రీ కాలేజీ విద్యార్థులకు రోడ్డు భద్రతా, ట్రాఫిక్ నింబధనలపై అవగాహన కార్యాక్రమాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడారు. యువతీ యువకులు తెలియని వ్యక్తులతో చాటింగ్ చేయడం, వారు పంపించిన లింక్‌లను క్లిక్ చేయడం మంచిదికాదన్నారు. ప్రతీ ఒక్కరు రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలని కోరారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలేజీ కరస్పాండెంట్ డా.జి.నాగయ్య, ప్రిన్సిపాల్ సల్మా సుల్తానా, అబ్డుల్, మజద్ఖాన్తోపాటు మలక్‌పేట్, దిల్సుఖ్నగర్ పోలీసులు, విద్యార్థులు కాలేజీ సిబ్బంది దాదాపు 160మందికిపైగా పాల్గొన్నారు.