Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మార్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు బి.ఎన్ రమేష్ మాదిగ
నవతెలంగాణ-హయత్నగర్
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలని జాతీయ మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బి.ఎన్ రమేష్ మాదిగ అన్నారు. ఏప్రిల్ 4,5 తేదీల్లో ఢిల్లీలో జరిగే ధర్నా కరప్రతాలను మంగళవారం ఎల్బీనగర్ రింగ్ రోడ్డులో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చిటుపాక యాదగిరి మాదిగ ఆధ్వర్యంలో విడుదల చేశారు.
రమేష్ మాట్లాడుతూ మాదిగల న్యాయమైన డిమాండ్ ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరారు. న్యాయమైన డిమాండ్ నెరవేర్చకపోతే రాబోయే రోజులలో బీజేపీ ప్రభుత్వానికి మాదిగలు, మాదిక ఉపకులాలు తగ్గిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ కోసం జరిగే ధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మోదుగు లాజరు మాదిగ, ఎంఎస్పీ జాతీయ అధ్యక్షులు మల్లేశ్వర రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిటపాక ప్రభాకర్ మాదిగ, పాల్వాయివేణు మాదిగ, బీఆర్ఎస్ ఎల్బీనగర్ నియోజక వర్గం ఎస్సీ సెల్ చైర్మెన్ జోగు రాములు మాదిగ, ఈదుల పరుశురాములు, మామిడి కిషోర్ మాదిగ, లక్ష్మణ్ మాదిగ, తీగల యాదగిరి, చిప్పలపల్లి నరసయ్య, కొండగడుపున నగేష్, మామిడికాయల జనార్ధన్, ఉడుగు యాదయ్య, నిమ్మల అంజయ్య, విష్ణువర్ధన్, కృష్ణ, చిప్పలపల్లి యాదగిరి, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.