Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
నవతెలంగాణ-ఎల్బీనగర్
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని లింగోజిగూడ డివిజన్లో మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు, లింగోజిగూడ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు వరప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బుగ్గరపు దయనంద్, కార్పొరేషన్ చైర్మెన్ అమరవాది లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు గజ్జెల మధుసూదన్ రెడ్డి, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధిలో ఎల్బీనగర్ ముందంజలో ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎల్బీనగర్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది అన్నారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో పలు కమిటీ పదవులు ఉన్న ప్రతి ఒక్కరు మన నియోజకవర్గ పరిధిలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమంలో పాలుపంచుకోవాలి అని తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎమ్మెల్యేగా పార్టీ మారాల్సి వచ్చినపుడు ముఖ్యమంత్రిని నియోజకవర్గ అభివృద్ధి కోసం 5 డిమాండ్లు అడగడం జరిగిందని, వాటిని అమలుపరచడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడి వలే పార్టీ కోసం పనిచేయాలని, ఉద్యమకారులకు మన టీఆర్ఎస్ పార్టీ నందు ఎప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్రె శ్రీనివాస్, తిలక్ రావు, నర్సింహ గుప్తా, లక్ష్మీప్రసన్న, శ్రీధర్‌గౌడ్, భాస్కర్ గంగపుత్ర, శ్రవణ్ కుమార్, జగన్నాథ్ రెడ్డి, ఇంద్రజి, ఆశిష్, రాజు గౌడ్ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, మహిళలు, పలు విభాగాల అనుబంధ కమిటీసభ్యులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, పలు కాలనీ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.