Authorization
Sun April 06, 2025 11:00:34 pm
- ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
నవతెలంగాణ - సరూర్‌నగర్
ఆరోగ్యవంతమైన జీవితానికి యోగ ఎంతో ముఖ్యమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. జాగృతి అభ్యుదయ సంఘం చైర్మెన్ భావన శ్రీనివాస్, ఇస్మాయిల్ గురూజీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన యోగా శిక్షణ తరగతుల బ్రోచర్‌ను ఎమ్మెల్యే మంగళవారం ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మానసికంగా, శారీరకంగా బలంగా ఉండడానికి యోగా ఎంతగానో ఉపయోగ పడుతుందని అన్నారు. మనిషి శరీరం చేయగలిగే అత్యుత్తమ వ్యాయామాల్లో యోగ ప్రథమ స్థానంలో ఉంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగ ఎంతో ఆదరణకు నోచుకుందన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఏప్రిల్ రెండో తారీకు నుంచి యోగ శిక్షణా తరగతులు కర్మన్‌ఘాట్‌లోని మందమల్లమ్మ గార్డెన్ వద్ద గల లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణ తరగతులలో వ్యాయామాలు, ఆసనాలు, ప్రాణాయమాలు, ధ్యానము నేర్పించబడును అని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 5-30 నుంచి 7గంటల వరకు సాయంత్రం 6:30 నుంచి 8 గంటల వరకు నిర్వహించబడుతుంది. ఈ శిక్షణలో పాల్గొనదలచిన వారు 9603256572 నెంబర్లను సంప్రదించగలరు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిరాజు తపోవదనగిరి, గోపాలకృష్ణ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.