Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ ఇన్చార్జి మల్ రెడ్డి రాంరెడ్డి
నవతెలంగాణ-ఎల్బీనగర్
దేశంలో బీజేపీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తుందని ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మల్రెడ్డి రాంరెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దుపై మంగళవారం మల్రెడ్డి రాంరెడ్డి ఆధ్వర్యం లో ఎల్బీనగర్ జంక్షన్ వద్ద సత్యాగ్రహ సంకల్ప దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ఎస్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ బెల్లయ్య నాయక్, హాత్ సే హాత్ జోడో ఎల్బీనగర్ కన్వీనర్ రఘువీరారెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో ప్రస్తుతం నాయకులకంటే ఎక్కువగా ప్రజలకే అవసరం ఏర్పడిందని అన్నారు. దేశ ప్రజలందరూ కాంగ్రెస్ వైపు ఉన్నందుకే ఓర్వలేక బీజేపీ తప్పుడు కేసులను పెడుతుందని అన్నారు. హాత్ సే హాత్ జోడో ఎల్బీనగర్ కన్వీనర్
పి.రఘువీరా రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీకి మద్దతుగా జరుగుతున్న సత్యాగ్రహ సంకల్ప దీక్ష మల్ రెడ్డి రాంరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించమని పార్టీ తనను పంపిందని తెలిపారు. ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మల్ రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం ప్రశ్నించే గొంతుకని నొక్కివేయడమే అని అన్నారు. పార్లమెంటు సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తుందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలను అణిచి వేయడమే లక్ష్యంగా బీజేపీి పాలన ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు గుర్రం శ్రీనివాస్ రెడ్డి, శ్రీపాల్, సదాశివుడు, కిషోర్‌గౌడ్, నరసింహ యాదవ్, వేణు యాదవ్, మంజులారెడ్డి, రవికాంత్, మతిన్ భారు, సురేందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, శ్యామ్, చరణ్ రెడ్డి, రమేష్ నాయక్, రాజశేఖర్, మక్సుత్, షరీఫ్, జానీ, అరుణ్, నారాయణ, స్వర్ణ, మాధవి, కవిత, సౌమ్య, సంగీత, భాను, అస్లాం గోవర్ధన్, శరత్ కృష్ణారెడ్డి, యాదయ్య, మరియు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.