Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్
నవతెలంగాణ-హైదరాబాద్
మోదీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను గౌతమ్ అదానీ, అంబానీ కంపెనీలకు దోచిపెడుతూ, ఆ దోపిడీని వ్యతిరేకించిన ప్రతిపక్షాలపై సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి ఇబ్బందులకు గురి చేస్తుందని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ అన్నారు. మంగళవారం బాగ్లింగంపల్లిలోని ఓంకార్ భవన్లో బీఎల్ఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దండి వెంకట్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి లొంగని వారిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం, అభివృద్ధి 20 ఏండ్ల వెనక్కి వెళ్లిందన్నారు. పెరుగుతున్న ధరలు, వంట గ్యాస్ సిలిండర్ల డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరిసిందన్నారు. ఏప్రిల్ 11 మహాత్మా జోతిబా ఫూలే, ఏప్రిల్ 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను బీజేపీ కేంద్ర ప్రభుత్వ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా జరపా లని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 10న డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల వద్ద బీఎల్ఎఫ్ ఆధ్యర్యంలో జరిగే ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీఎల్ఎఫ్ రాష్ట్ర కమిటీ నాయకులు వనం సుధాకర్, వల్లేపు ఉపేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు సుకన్య, తుకారాం నాయక్, మట్టయ్య, సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.