Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
నేడు ఇందిరాపార్క్ వద్ద జరిగే జనచైతన్య యాత్ర బహిరంగ సభను జయప్రదం చేయాలని సౌత్ జిల్లా సీఐటీయూ నాయకులు పి.నాగేశ్వర్ అన్నారు. గోషామహ ల్ బేగం బజార్ డివిజన్లో హమాలీ యూనియన్ నాయ కులతో కలిసి బహిరంగ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామన్నారు. అన్ని రంగాల కార్మికులు పాల్గొని ఈ మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె.జంగయ్య, తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్స్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ సీఐటీయూ సౌత్ జిల్లా ఉపాధ్యక్షులు నెమ్మది గోపాల్, ముక్తార్ గంజ్, మహారాజ్ గంజ్ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ సీఐటీయూ అధ్యక్ష, కార్యద ర్శులు ఆర్.సాయిలు, జి.నర్సింహ్మ, కమిటీ సభ్యులు, సంతోష్, జి.అశోక్, ఎస్.కేశవరావు, కె.కిషన్, కె.రాములు, వి.విఠల్, కిరణ్, జి.సంజు, తదితరులు పాల్గొన్నారు.
జూబ్లిహిల్స్ : జనచైతన్య యాత్ర బహిరంగ సభను జయప్రదం చేయాలని ఎస్పిఆర్ హిల్స్ 2 బొమ్మల వద్ద సీపీఐ(ఎం) జూబ్లీహిల్స్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ జోన్ కన్వీనర్ రాపర్తి అశోక్, టి.సాయి శేషగిరిరావు, జె.స్వామి, టి.భాగ్యరాజ్, బాలయ్య, సికిందర్, సత్యనారా యణ, నాగేష్, తదితరులు పాల్గొన్నారు.