Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న బీజేపీకి చరమగీతం పాడాలనీ, మతోన్మాద బీజేపీ కార్పొరేట్ విధానాలను నుంచి దేశాన్ని రక్షించుకుందామని సీపీఐ (ఎం) ముషీరాబాద్ నియోజకవర్గ కార్యదర్శి ఎం.దశరథ్, నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.వెంకటేష్ పిలుపునిచ్చా రు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జన చైతన్య యాత్రలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.దశరథ్ మాట్లాడుతూ దేశంలో 15 మంది అత్యధికంగా సంప న్నులు ఉన్నారన్నారు. ఆదానీ, అంబానీ లాంటి వారిపై బీజేపీ ప్రభుత్వం ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ పరం చేయడం బీజేపీ, మోడీ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ఈ దాడుల అనంతరం కాషాయ కండువా కప్పుకోగానే కేసులు లేకుండా కుళ్లు రాజకీయాలు చేస్తారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వివరీతంగా పెరిగాయన్నారు. నిత్యావసర ధరలు పెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. కార్పొరేట్లకు 10 శాతం రాయితీలు ఇస్తూ పన్ను రద్దును చేస్తున్నారన్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ప్రశ్నించే నాయకులపైన, సామాజిక సంఘాల పైన, పత్రిక విలేకరుల పైన, మహిళలపైన దాడులు విపరీతంగా పెరిగాయన్నారు. ఇప్పటికైనా బీజేపీని ఓడించే దిశగా ప్రజలందరూ చైతన్యంతో ముందు సాగా లని సూచించారు. నేడు ఇందిరా పార్కు దగ్గర జరగ బోయే ప్రజా చైతన్య యాత్ర ముగింపు సభలో ముషీరా బాద్ నియోజకవర్గ ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ ర్యాలీలో సీపీఐ(ఎం) నగర కమిటీ సభ్యులు ఎన్.మారన్న, ముషీరాబాద్ నియోజకవర్గ కార్య వర్గ సభ్యులు ఎ.శ్రీరాములు, ఆర్ఈ బాబు, పి.విమల, కమిటీ సభ్యులు కె.రమేష్, ఏఏకె పాషా, ఏ.పద్మ, నర్సింగరావు, ఎల్లయ్య, సిరాజుదిన్, సైదులు, పుల్లారావు, కృష్ణస్వామి, తదితరులు పాల్గొన్నారు.