Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సూచన మేరకు లక్ష్య అసెస్మెంట్ టీమ్ మంగళవారం కింగ్ కోఠి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించింది. కేరళకు చెందిన డా.స్వాతి లక్ష్మి, నాగాలాండ్‌కు చెందిన డా.ఛావారు న్యూమామ్ లా ఆస్పత్రిలోని మెటర్నిటీ, చైల్డ్ వార్డులను సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర నాథ్, ఆర్ఎంఓ డాక్టర్ సాధన, గైనిక్ హెచ్ఓడీ డాక్టర్ జలజతో కలిసి పరిశీలిం చారు. ఈ వార్డుల్లో తల్లులకు, పసిపిల్లలకు అందుతున్న వైద్య సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. పరిశుభ్రత వంటి విషయాలపై లక్ష్య టీం పరిశీలించింది. ఈ టీమ్ హాస్పిటల్‌లోని అన్ని విషయాలను రికార్డులను పరిశీలించింది. కింగ్ కోఠి ప్రభుత్వ హాస్పిటల్లో ఇప్పటికే ఎన్నో ప్రత్యేకతలు, సౌకర్యాల్లో రాష్ట్రంలో ఉన్న జిల్లా హాస్పిటల్స్‌లో ప్రథమ స్థానంలో ఒకటిగా కింగ్ కోఠి ప్రభుత్వ హాస్పిటల్‌కు గుర్తింపు దక్కిన విషయం తెలిసిందే. లక్ష్య టీం ఇక్కడి సౌకర్యాలు బాగున్నాయని కితాబిచ్చింది. ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్ రజీయ, షాహిదా, స్టాఫ్ నర్సులు, తదితరులు పాల్గొన్నారు.