Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఐసీహెచ్ఆర్ సహకారంతో రెండు రోజుల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్, సదస్సు కన్వీనర్ డాక్టర్ కొండా నాగేశ్వర్ అధ్యక్షతన ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.గణేష్ మాట్లాడారు. కింది స్థాయి వర్గాలు ఇటీవల కాలంలో ఉన్నత వర్గాల సంస్కతిని అనుకరించి, వారి జీవన విధానాన్ని తమ జీవితంలో భాగంగా చేసుకు నేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ సంస్కృతి ప్రభా వం సామాజిక జీవనంపై తప్పనిసరిగా ప్రభావం చూపుతున్నదని పేర్కొన్నారు. కార్ల మార్క్స్, వెబర్ల సిద్ధాంత ఆలోచన విధానాన్ని, మతం పట్ల వారి ఆలోచన సరళిని విమర్శనాత్మకంగా వివరించారు. కార్ల మార్క్స్ మతం మత్తుమందు వంటిదని పేర్కొనగా, వెబ్ నార్ మతం వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారని తెలిపారు. ఒకే విషయం పట్ల రెండు ఆలోచన ధోరణలు ఉన్నప్పుడు వాటిని సునిసితంగా అధ్యయనం చేయాల్సిన బాధ్యత మేధావి వర్గంపై ఉన్నదని పేర్కొన్నారు. కొండా నాగేశ్వర్ మాట్లాడుతూ మతం వ్యక్తిగత జీవన విధానంలో అంతర్భాగంగా ఉండాల్సిన అవసరం ఉన్నదన్నారు. అంతర్గతంగా ఉండాల్సిన మతపరమైన విషయాలు బాహ్య ప్రేరకంగా పని చేయటం తిరోగమి ఆలోచన విధానం వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉందన్నారు. భార తదేశం లాంటి నిచ్చెన మెట్ల వ్యవస్థను అర్థం చేసుకోవా లంటే శ్రమ విభజనను శాస్త్రీయపరమైన, హేతువాదప రమైన దృష్టి అవసరమని పేర్కొన్నారు. ప్రొ.అడపా సత్య నారాయణ మాట్లాడారు. శామ్యూల్ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సెల్ డైరెక్టర్లు, అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ ఉద్యోగులు, స్కాలర్స్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.