Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంతోష్‌నగర్
ఇటీవల విడుదలైన పి.ఎస్.టి. ఎస్.ఓ. ఫలితాల్లో లింగోజిగూడ డివిజన్ పరిధిలోని కర్టన్షట్ శ్రీచైతన్య హైస్కూల్ విద్యార్థులు 386 మందికి గాను అందరూ మెరిట్ సర్టిఫికెట్స్ సాధించారని ప్రిన్సిపల్ సయ్యద్ ఖాసీం అలీ హర్షం వ్యక్తం చేశారు. శ్రీ చైతన్య యాజమాన్యం విద్యార్థుల సర్వతో ముఖాభివద్ధికి దోహదం చేస్తుందని ఏ.జీ.ఎం. టి.సతీష్ అభినందనలు తెలిపారు. బుధవారం తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయుల ప్రోత్సాహం, విద్యార్థుల కషిలోనే ఈ విజయం సాధ్యమైందని ఎగ్జిక్యుటివ్ డీన్ కె.ప్రవీణ్ అన్నారు. ఐదవ తరగతి విద్యార్థిని ఎస్.లౌక్యారెడ్డి ల్యాప్‌టాప్ గ్రాండ్ ప్రైజ్ సాధించగా, మేఘన, శ్రీహిత, సాయికార్తీక్, శ్రీ సాయిచరిత, వర్షిత్‌రెడ్డి, తాహెర్ అహ్మన్లు మొదటి ఐదు బహుమతులు అందుకున్నారని అకాడమిక్ కోఆర్డినేటర్ రఘువంశీ తెలిపారు. మొత్తం 29మంది కన్సోలేషన్, 107మంది గోల్డ్ మెడల్స్, ఐదుమంది ప్రత్యేక బహుమతులు అందుకున్నారని ఇన్చార్జులు లక్ష్మి, సతీష్, పి.మానస తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్-ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి, అకాడమిక్ ఎన్.వెంకట రమణ, ప్రైమరీ ఇన్చార్చి లక్ష్మి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.