Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్మెట్
పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ తట్టిఅన్నారంలోని శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజ్లో 11వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర డిజాస్టర్, రెస్పాన్స్ మరియు అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ వై.నాగిరెడ్డి హాజరై ప్రసంగించారు. దేశ భవిత విద్యార్థుల చేతుల్లోనే ఉందని, అందుకు విద్యార్థులు నాణ్యతతో కూడిన విద్యను అభ్యసించి, తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలన్నారు. సాంకేతిక పురోగమన అభివద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలన్నారు. దఢ సంకల్పంతో విద్యార్థులు విద్యను అభ్యసించడంలో ముందుండాలన్నారు. శ్రేయాస్ ఇంజినీరింగ్ కళాశాల ఆవిర్భవించి 11వసంతాలు అవుతుందని, ఆనతి కాలంలోనే ఎంతోమంది ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత శ్రేయాస్ కళాశాలకు దక్కిందని కళాశాల చైర్మెన్ వినరు కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యార్థులకు విద్యాబోధన అందించడంలో ముందుంటామన్మారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి రవీంద్రనాథ్ యాదవ్, ట్రెజరర్ ఎన్.శరత్ రెడ్డి, వైస్ చైర్మెన్ హదరు రెడ్డి, ప్రిన్సిపాల్ సాయి సత్యనారాయణ రెడ్డి, ఏవో రాజు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.