Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
నియోజకవర్గ పరిధిలో సుమారు80శాతం మేర అబివద్ది చేశామని ఎల్బీనగర్ శాసన సభ్యులు దేవి రెడ్డి సుదీర్ రెడ్డి స్పష్టం చేశారు.బుధవారం హయత్ నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీ ల్లో అబివద్ది పనులకు స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి తో కలిసి శంకుస్థాపనలు చేశారు. డివిజన్లోని వరదయ్య కాలనీలో సుమారు 20 లక్షల రూపాయల వ్యాయంతో నూతన సిసి రోడ్.శంకర్ నగర్ మెగాసిటీ స్కూల్ సమీపంలో దాదాపు 60 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు.హయత్ నగర్ గ్రామంలోని గుడాల బస్తి, రజక బస్తి, కాస్బాగ్ బస్తీల్లో నిర్మించనున్న నూతన సీసీ రోడ్ శంకుస్థాపనలు వెంకటాద్రి నగర్ లో నిర్మించనున్న నూతన భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ సదుపాయం.
ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ బండారి భాస్కర్, డివిజన్ అధ్యక్షుడు ఉగాది ఎల్లప్ప, కార్యదర్శి గోవిందచారి, నాయకులు ఎర్రవెల్లి సత్యనారాయణ, జనార్ధన్, మధు సూదన్, లక్ష్మణ్, అరుణ్, బాలు నాయక్, బీజేవైఎం అధ్యక్షులు ఎర్ర ప్రేమ్, ఆయా కాలనీలా సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.