Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాదంటే మీరు కట్టలేరక్కడ
- తమ భూమిలోకి దౌర్జన్యం చేశారని మేడిపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బాధితులు
నవతెలంగాణ-బోడుప్పల్
పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని విష్ణుపురి కాలనీలో తమకు చెందిన భూమిలో స్థానికంగా ఉన్న కొందరు అధికార పార్టీ నేతలు దౌర్జన్యంగా గుంజుకోవాలని చూస్తున్నారని బాధితులు యాదగరి, నర్సింహ్మ ఆవేదన వ్యక్తం చేశారు. విష్ణుపురి కాలనీ, శ్రీపాద ఎన్‌క్లేవ్‌లో నడుస్తున్న వివాదంపై మరో వర్గం మంగళ వారం వివరణ ఇచ్చింది. సర్వే నంబర్ 122 పార్టు, 124 పార్టులలో ముస్లింలకు, వంశపారపర్యంగా వచ్చిన భూమని 1979లో లేఅవుట్ చేశారని తెలిపారు. దీనికి ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 125, 126, 127, 79లలో గల భూమిని పోగుల నర్సింహ్మరెడ్డి తన ల్యాండ్ 9 ఎకరాల 20గుంటలతో పాటుగా జమాల్‌కు తెలియకుండా ఆయన ల్యాండ్‌ను కలుపుకొని మొత్తం 16 ఎకరాల 20 గుంటల ల్యాండ్ 2 లే అవుట్లు చేశారని తెలిపారు. దీనిపై పోగుల నరసింహారెడ్డి దగ్గర కోనుగోలు చేసిన వారు.. కోర్టును ఆశ్రయించగా 1998-2000లో ఎంక్వైరీ కమిషన్ వేయాలని, అలాగే ఏడీ సర్వే చేయాలని కోర్టు తెలిపిందని, ఏడీ సర్వే రిపోర్టు కూడా ఈ భూమి జమాల్‌కు సంబంధించిందని తెలిపిందని తెలిపారు. లే అవుట్ 2016లో జమాల్ దగ్గర నుండి మల్లికార్జున్ రెడ్డి తీసుకున్నారని, వారి నుంచి మహేష్, నారాయణ, ఉషారాణి, రంగారెడ్డిలు తీసుకున్నారని తెలిపారు. వారి నుండి 2019లో గందమల్ల యాదగిరి, నర్సింహ్మ, అయిలయ్య, నాగేష్, సుమన్ గౌడ్, విజరు గౌడ్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నామని తెలిపారు. కోర్టు ఇచ్చిన తీర్పుతో పోలీస్ స్టేషన్లో స్థానిక ఎమ్మార్వోకు కాపీ ఇచ్చామని, దీంతో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని చెప్పినా వినకుండా కాలనీలోని ఉమా మహేశ్వర్ రెడ్డి, రఘువర్ధన్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి మరికొంత మంది యథేచ్ఛగా క్రయవిక్రయాలు చేస్తూ నిర్మాణాలు కొనసాగిస్తున్నారన్నారు. దీనిపై అనేకమార్లు కమిషనర్ దష్టికి తీసికెళ్లినా కూడా దష్టిసారించకపోవడంతో డిప్యూటీ మేయర్, కొంతమంది కార్పొరేటర్ల దష్టికి తీసుకెళ్లడంతో నిర్మాణా లకు పర్మిషన్లు ఇవ్వవద్దని ఆపివేయడం జరిగిందన్నారు. ఇంతటితో ఆగకుండా కార్పొరేటర్లపై, డిప్యూటీ మేయర్‌పై నిందలు మోపుతూ వారిపై దుష్ప్రచారం చేస్నున్నారు. ఇది తగదని, ఇటువంటి ల్యాండు సర్వే చేయడానికి సహకరించాలని, సర్వేలో ఎవరి భూమి అని తేలితే వారికి వదిలేద్దామని, దీనికి మీరు సిద్ధమా? అని బహిరంగంగా సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో గందమల్ల యాదగిరి, నర్సింహ్మగౌడ్, నాగేష్, సుమన్‌గౌడ్, విజరుగౌడ్, కుమార్‌గౌడ్ పాల్గొన్నారు.
పీఎస్‌లో ఫిర్యాదు...
తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా తమపై దౌర్జన్యం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు మేడిపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై మేడిపల్లి సీఐ గోవర్ధన గిరి మాట్లాడుతూ ఇరువర్గాల వారి భూమి పత్రాలను పరిశీలించిన అనంతరం తప్పు ఎవరిది ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.