Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడ్మెట్
మౌలాలి ఆర్టీసీ కాలనీలో రెండు రోజుల క్రితం చెత్త ఆటో కింద పడి చనిపోయిన బాలుడి కుటుంబ సభ్యుల ను బుధవారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లా డుతూ ఇంటి ఎదుట ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవ శాత్తు మృతి చెందటం బాధాకరమన్నారు. మృతుని కుటుంబానికి రూ.1,50,000 ఆర్థిక సహాయం చేస్తానని తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్ కుమార్, సతిష్ కుమార్, పిట్ల శ్రీనివాస్, గుండా నిరంజన్, సయ్యద్ మబ్బు, ఇబ్రహీం, నవాబ్, సంతోష్ గప్తా, బాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు