Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
పుట్టిన గ్రామంలోని పేదవారిని అదుకుంటూ సేవ చేస్తున్న బీఆర్ఎస్ నాయకుడు గుర్రం శ్రీధర్ రెడ్డిని పలువురు అభినందిస్తున్నారు. కీసర మండలం పరిధిలోని కీసర గ్రామానికి చెందిన గుర్రం శ్రీధర్ రెడ్డి కీసర గ్రామంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి రూ.10వేల ఆర్థిక సహాయం చేస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు. కీసర గ్రామానికి చెందిన పుట్ట శ్రీనివాస్ గౌడ్, కోమలి మురుగేష్, కీసరగుట్ట ఒంటి పులి శ్రీను, కీసరగుట్ట చిన్నారి పురాణం భువన, ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున నాలుగు కుటుంబాలకు రూ.40వేల ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు చినింగని బాల్ రాజు, బీఆర్ఎస్ మండల మీడియా సెల్ అధ్యక్షులు గోరంటి ప్రవీణ్, బీఆర్ ఎస్ గ్రామ ఉపాధ్యక్షులు సుమన్ బన్నీ, మిట్టపల్లి రాఘవేందర్ గౌడ్, నర్సింగ్, రాగుల సాయి, యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.