Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగరంలోకి జన చైతన్య యాత్రలు
- ఘన స్వాగతం పలికిన జిల్లా నాయకులు
- ఇందిరాపార్క్ వద్ద ముగింపు సభకు తరలిన
మూడు యాత్రుల
నవతెలంగాణ-తుర్కయాంజల్/ఓయూ/సుల్తాన్ బజార్
సీపీఐ(ఎం) అఖిల భారత కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్రం లో చేపట్టిన మూడు జనచైతన్య యాత్రలు బుధవారం కదంతొక్కుతూ హైదరాబాద్‌లోకి ప్రవేశించాయి. ఈ యాత్రలకు నగరంలోని పలు చోట్ల పార్టీ జిల్లా నాయకుల నుంచి ఘన స్వాగ తం లభించింది. అలాగే పలు చోట్ల బైక్ ర్యాలీలు నిర్వహించారు.
సీపీఐ(ఎం) కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు నేతృత్వంలో సాగుతున్న యాత్రలో భాగంగా బుధవారం తుర్కయంజాల్‌లోని రాగన్నగూడలోని రాజీవ్ గహకల్పలో ఆ పార్టీకి సంబంధించిన నూతన జెండాను యాత్ర రధ సారథి, కార్యదర్శి వర్గ సభ్యు లు పోతినేని సుదర్శన్ రావు ఆవిష్కరించారు. అనం తరం తుర్కయంజాల్ చౌరస్తా వద్ద జరిగిన సభలో పార్టీ వారు మాట్లాడారు. మోడీ, అమిత్‌షాల నేతత్వంలో కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లు కట్టబెడుతూ ప్రజలపై భారాలను మోపుతూ కోట్లాది మందిని పేదలుగా మార్చారన్నారు. దేశమం టే, అదాని, అంబానీ సొత్తుగా మార్చేశార న్నారు. నూనె లు, గ్యాస్ , పెట్రోలు, డీజిల్ తో సహా అన్ని రకాల సరుకుల ధరలు రెండు మూడు రెట్లు పెంచారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి, పాలడుగు భాస్కర్, జిల్లా కార్యదర్శి కాడిగల భాస్కర్, కార్యదర్శి వర్గ సభ్యులు పగడాల యాదయ్య, బోడ సామెల్, డి జగదీష్, జిల్లా కమిటీ సభ్యులు డి కిషన్, సీహెచ్ జంగయ్య, శ్యాంసుందర్, శ్రీనివాస్ రెడ్డి, ఆలంపల్లి నరసింహ, రావుల జంగయ్య, ఏర్పుల నరసింహ, గోరింకల నరసింహ, రామకష్ణా రెడ్డి, ప్రకాష్ శరత్, కొందిగారి శంకర్, ఎన్ యాద గిరి, లక్ష్మ య్య, సత్యనా రాయణ, శారద, శివప్రసాద్, వెంకటేష్, తదితరులు పాల్గొ న్నారు. అనం తరం యాత్ర అబ్దుల్లా పూర్మెట్, హయ త్‌నగర్, ఎల్బీనగర్, మలక్‌పేట్ మీదుగా కోఠి చేరుకుంది. కోఠి ఉమెన్స్ కళాశాల వద్ద సీపీఐ(ఎం) సౌత్ జిల్లా నాయకులు శ్రావణ్ కుమార్, కే జంగయ్య, కోటయ్య, అంజయ్య, హనుమం తులు స్వాగతం పలికారు. అనంతరం అబిడ్స్ మీదుగా ఇందిరాపార్క్‌కు ర్యాలీ తరలివెళ్ళిం ది. కోఠి, సుల్తా న్ బజార్, అబిడ్స్, గోషామహల్ నియోజకవర్గంలో సీపీఐ(ఎం) జెండాలతో, తోరణాలతో నిండిపోవడంతో ప్రజలను ఆకర్షించింది.
ఇక సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య నేతృత్వంలో సాగుతున్న మరో జనచైతన్య యాత్ర బుధవారం ఈసీఐఎల్‌లో ప్రారంభమై లాలాపేట్‌కు చేరుకుంది. ఈ యాత్రకు సీపీఐ(ఎం) మేడ్చల్ జిల్లా కార్యదర్శి సత్యంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యదర్శి ఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. బృందానికి నాయకత్వం వహిస్తున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైం దన్నారు. 9 సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలం భిస్తూనే ఉందన్నారు. ఇచ్చిన వాగ్దానాలు ఏమాత్రం నెరవేర్చక దేశ ప్రజల ఆదాయాలు దోచుకోవడం, సహజ సంపదను బడా బాబుల కు కట్టబెట్టడం చేస్తోందన్నారు పార్టీ మేడ్చల్ జిల్లా సెక్రెటరీ సత్యం హైదరాబాద్ జిల్లా సెక్రెటరీ శ్రీనివాస్, కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేష్, రాజన్న, శ్రీనివాస రావు, నగర కమిటీ సభ్యులు, సికింద్రా బాద్ జోన్ కన్వీనర్ ఎం అజరు బాబు, ఏం మారన్న, నరేష్, కిరణ్, జూన్, నాయకులు మహేందర్, ఆర్ మల్లేష్, ప్రవీణ్, కపాకర్ పాల్గొన్నారు.
అలాగే సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ వర్గ సభ్యులు జాన్ వెస్లీ నేతృత్వంలో సాగుతున్న మరో జనచైతన్య యాత్ర బచంద్రాయ ణగుట్టలో ప్రారంభమై చార్మినార్, అప్జల్ గంజ్, గాంధీభవన్ మీదుగా ఇందిరాపార్క్ వద్ద బహిరంగ సభకు చేరుకుంది. పాతబస్తీ సౌత్ కమిటీ ఆధ్వర్యంలో చంద్రాయణ గుట్ట చౌరస్తా నుంచి భారీ బైక్ ర్యాలీతో బయలుదేరారు. ఎండి అబ్బాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్వి రమ, వై సోమన్న, ఆశన్నలు ప్రారంభించారు.