Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
- అన్ని నియోజకవర్గాలకు సికింద్రాబాద్
ఆదర్శం : బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జ్
దాసోజు శ్రవణ్
నవతెలంగాణ-ఓయూ
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావుగౌడ్ అన్నారు.అన్ని నియోజకవర్గాలకు సికింద్రాబాద్ ఆదర్శమని తెలిపారు. సితాఫల్ మండీ డివిజన్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం బుధవారం సితాఫలమండీలో నిర్వహించారు. బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్జి డాక్టర్ దాసోజు శ్రవణ్, సికింద్రాబాద్ పార్లమెంటరీ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్, కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, లిం గాని ప్రసన్న లక్ష్మి, బీఆర్ఎస్ యువ నేతలు తీగుల్ల కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, నాయకులు కరాటే రాజు, సమన్వ య కర్తలు జలంధర్ రెడ్డి, రాజ సుందర్‌లతో పాటు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమ్మేళ నంలో తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రసంగిస్తూ సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిదు ్దతున్నామని తెలిపారు. కార్యకర్తల శ్రమ, కషిని విస్మరించ బోమని అన్నారు. డాక్టర్ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ దేశానికే రాష్ట్రం తలమానికంగా నిలుస్తోందని అన్నారు. ప్రతిపక్షాలు కేవలం ఎన్నికలు, రాజకీయ ప్రయోజనాలకే పాకులడుతున్నాయన్నారు. రాష్ట్రానికీ మరో సారి కెేసీఆర్ నాయకత్వం అవసరమన్నారు. అభివృద్దిలో, ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పించడంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కృషి ఆదర్శంగా ఉందని ప్రశంసించారు. కార్పొరేటర్ సామల హేమ మాట్లాడుతూ 50 సంవత్సరాల్లో చేపట్టని ఎన్నో పనులను కేవలం స్వల్ప వ్యవధిలో చేపట్టిన ఘనత సికింద్రాబాద్‌లోనే ఉందని అన్నారు. తలసాని సాయి కిరణ్ యాదవ్ మాట్లా డుతూ రానున్న రోజుల్లో బీఆర్ఎస్ తన సత్తాను చాటుకుం టుందని అన్నారు.బీఆర్ఎస్ యువ నేతలు తీగుల్ల కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్ లు మాట్లాడుతూ సికింద్రాబాద్‌కు తమ పార్టీ కంచుకోటగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ పతకాన్ని పద్మారావు గౌడ్, డాక్టర్ దసోజు శ్రవణ్ లు ఆవిష్కరించారు.
ఇండ్ల పట్లాలు అందజేసిన డిప్యూటీ స్పీకర్
మారేడుపల్లి మండలంలోని వివిధ ప్రాంతాల్లో ప్రభు త్వం జారీ చేసిన జీవో 58 ప్రకారం 60, 120 గజాలలో అర్హులైన పేదలకు ఇండ్ల పట్టాలను బుధవారం డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పంపిణీ చేశారు. సితాఫల్ మండీలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 31 మంది లబ్దిదారులకు కలెక్టర్ కార్యాల యం ద్వారా మంజురైన పట్టా పత్రాలు, క్రమబద్ధీకరణ ఉత్తర్వులను అందించారు. కార్పొరేటర్లు లింగాని ప్రసన్న లక్ష్మి, సామల హేమ, కంది శైలజ, నేతలు తీగుల్ల కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, జలంధర్ రెడ్డి పాల్గొన్నారు. పేద ప్రజల ఇబ్బందులను దష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ ప్రభు త్వం జీవో 58 ద్వారా అర్హులైన వారికి ఇండ్ల పట్టాలి వ్వడానికి కృషి చేస్తోందన్నారు.