Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అడిక్ మెట్
ముషీరాబాద్ నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. నియోజకవర్గంలోని కవాడిగూడ డివిజన్ బండ మైసమ్మ నగర్లో రూ. 22 లక్షల వ్యయంతో వాటర్ పైప్ లైన్ పనులను స్థానిక కార్పొరేటర్ రచన శ్రీతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ. కవాడిగూడ డివిజన్లో బండ మైసమ్మ నగర్లో గత సంవత్సరాల కాలంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. సమస్య పరిష్కారం కోసం నిరంతరం కషి చేయడం వలన ఇప్పుడు సాధ్యమైంది అన్నారు. అతి త్వరలో పనులు ప్రారంభించి పూర్తిచేసి ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీరు అందిస్తామని తెలిపారు. నియోజకవర్గ ప్రజల అధైర్యపడవద్దని, ప్రజా సమస్యల పరిష్కారనికి నిరంతరం అందుబాటులో ఉంటామని తెలిపారు. ప్రజలు నేరుగా తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు ముఠా జై సింహ, పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ వల్లాల శ్యామ్ యాదవ్, కార్యదర్శి సాయి క్రిష్ణ, బీఆర్ఎస్ నాయకులు రామచందర్, వల్లాల శ్రీనివాస్ యాదవ్, ఎస్ యాదగిరి, సంతోష్, లవ్ కుమార్, రాజేష్, శ్రీహరి, మహేష్, హనుమాన్ టెంపుల్ చైర్మెన్ రాజ శేఖర్ గౌడ్, ప్రవీణ్, దుర్గా స్వామి, మాధవి, సుశీల, జలమం డలి అధికారులు డీజీఎం కార్తీక్ రెడ్డి పాల్గొన్నారు.