Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంక్షేమానికి పెద్దపీట
- రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
- శామీర్‌పేట సొసైటీ నూతన భవనం ప్రారంభం
నవతెలంగాణ-శామీర్‌పేట
రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్‌పేట్ మండల కేంద్రంలో వ్యవసాయదారుల సేవా సహకార సంఘం నూతన భవనం, రూ.78లక్షలతో నిర్మాణం చేపట్టిన గోదాంను బుధవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం శామీర్‌పేట సొసైటీ 39వ సర్వ సభ్య సమావేశం సందర్భంగా సొసైటీ చైర్మన్ మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న సొసైటీని లాభాల్లోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని చైర్మన్ మధుకర్ రెడ్డిని అభినందించారు. సొసైటీలో రైతులకు మెరుగైన సేవలు అందించాలని రూ.3వేలు ఉన్న అంత్యక్రియల ఆర్థిక సహాయాన్ని రూ.6వేలకు పెంచాలని ఆదేశించారు. నేడు ప్రారంభించిన సొసైటీ కార్యాలయం పాలకవర్గం రాష్ట్రంలోనే మోడల్‌గా ఉందనీ, ఇది జిల్లాకే పెద్ద గర్వంగా ఉందన్నారు. రైతులకు ఏ కష్టం, నష్టం కలిగినా వెన్నంటి ఉంటానని భరోసానిచ్చారు. అతి త్వరలో ఈ ప్రాంత రైతులను కాళేశ్వరం తన స్వంత డబ్బులతో తీసుకువెళ్తాననీ, ప్రణాళికను సిద్ధం చేయాలని మధుకర్ రెడ్డి ని ఆదేశించారు. అభివృద్ధి చేయాలనే తపన, మనస్సు ఉంటే ఎంతైనా చేయవచ్చ అనీ, అందుకు ఈ సొసైటే నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపుర్ రాజు, ఎమ్మెల్సీ వాణిదేవి, జిల్లాపరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, రవి కుమార్, డిసిసిపి చైర్మన్ మనోహర్ రెడ్డి., పీఎస్సీ చైర్మన్ మధుకర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి మహేందర్ రెడ్డి, జెడ్పీటీసీ అనిత, ఎంపీపీ ఎల్లుబారు, మండల రైతుబందు సమితి అధ్యక్షుడు కంఠం కృష్ణారెడ్డి, ఎంపీటీసీలు సాయి, నాగరాజు, సర్పంచులు బాలమని, మోహన్ రెడ్డి, సింగం ఆంజనేయులు, విష్ణువర్ధన్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు, ప్రజాప్రతి నిధులు, అధికారులు, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, సుదర్శన్, చాంద్ పాషా, విష్ణు గౌడ్, రైతులు పాల్గొన్నారు.