Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలో '' ప్రగతి యాత్ర '' లో భాగంగా 34వ రోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పర్య టించారు. ఈ సందర్భంగా ఎం.ఎన్.రెడ్డి నగర్ (శివాల యం)లో రూ.12 లక్షలతో భూగర్భ డ్రయినేజీ, రూ.16 లక్షలతో సీసీ రోడ్లు, రూ 12 లక్షలతో పార్క్ అభివృద్ధి పనులను పూర్తి చేసినందుకు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలి పారు. మిగిలి ఉన్న మరో పార్క్ అభివృద్ధి, ట్రాన్స్ఫార్మర్ బదిలీ, మంచినీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేని కోరారు. ఎం.ఎన్. రెడ్డి నగర్ ఫేస్ -2 లో భూగర్భ డ్రైనేజ్ పూర్తి చేసినందుకు ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు. పెండింగ్‌లో రోడ్లు, పారిశుధ్య నివారణ, కుక్కల బెడద, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యేని కోరారు. ఎం.ఎన్.రెడ్డి నగర్ ఫేస్-1 లో రూ.3.30 కోట్లతో దాదాపు అన్ని పనులు పూర్తి చేసినందుకుఎమ్మెల్యేకి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. మంజూరైన రూ.10 లక్షలతో కమిటీ హాల్, రూ.25 లక్షలతో సీసీ రోడ్లు, వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ని కోరారు. నూతన వెల్ఫేర్ అసోసియేషన్ లెటర్ ప్యాడ్‌ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. అధ్యక్షులుగా కాలనీవాసులు ఎమ్మెల్యేని ఎన్నుకున్నారు. ఎం ఎన్ రెడ్డి నగర్ వెస్ట్ లో రూ.15 లక్షలతో భూగర్భ డ్రైనేజీ, రూ.30 లక్షలతో సీసీ రోడ్లు, రూ.12 లక్షలతో మంచినీటి పైప్ లైన్ పనులు పూర్తి చేసినందుకు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. కమిటీ హాల్ ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యేని కోరారు. అనంతరం ఎమ్మెల్యే ఆయా కాలనీలలో ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అక్కడే ఉన్న అధికారులకు ఆదేశాలిచ్చి త్వరలోనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీల సంక్షేమ సంఘాల అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, శ్రీకాంత్, సంపత్ గౌడ్, నాగేశ్వరరావు, వార్డు సభ్యులు సుధాకర్ గౌడ్, ఇందిరా రెడ్డి, సీనియర్ నాయకులు కుంట సిద్ధిరాములు, గుమ్మడి మధుసూదన్ రాజు, నరేందర్ రెడ్డి, నదీం రారు, నాగేష్ రెడ్డి విజరు హరీష్, శంకర్, భరత్, మోహన్ రావు, సంజీవరావు, శివరాం రెడ్డి, చంద్రారెడ్డి, రఘు, సంక్షేమ సంఘాల సభ్యులు, మహిళలు, నాయకులు పాల్గొన్నారు.