Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తన క్యాంప్ కార్యాలయంలో ఏప్రిల్ 2వ తేదీన కూకట్పల్లి ట్రక్ పార్క్ వద్ద జరగనున్న జాబ్ మేళాకుపై కూకట్ పల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ కో-ఆర్డినేటర్ సతీష్ అరోరా ఆధ్వర్యంలో కూకట్ పల్లి నియోజకవర్గం యువజన విభాగం, సోషల్ మీడియా విభాగాల సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ జాబ్ మేళాకు వచ్చే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాలంటీర్లు అందరూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎండ వేడిమి ఉండటం వల్ల మంచినీరు ఏర్పాట్లు, అంబులెన్స్‌లు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది కలక్కుండా సూచీ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఈ జాబ్ మేళాలో దాదాపు 100కు పైగా కంపెనీలు పాల్గొంటున్నాయనీ, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల న్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆవుల రవీందర్ రెడ్డి, పండాల సతీష్ గౌడ్, మందడి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.