Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
ప్రభుత్వం బ్యాంకుల ద్వారా మహిళా పొదుపు సంఘాలు (ఎస్ హెచ్ జీ ఎస్ ), వీధి వ్యాపారులు (స్ట్రీట్ విండర్స్ ), ముద్ర లోన్స్ వారి అభివృద్ధి కోసం బ్యాంకుల ద్వారా రుణాలు అందేలా చర్యలు తీసుకుంటోంది. జీహెచ్ఎంసీ గోషామహల్ సర్కిల్ -14 కార్యాలయంలో యూసీడీ పీఓ విద్యాసాగర్ మాట్లాడుతూ తమ యూసీడీ సిబ్బందితో మహిళ పొదుపు సంఘాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. 112 మహిళా పొదుపు సంఘాలకు ఇప్పటివరకు రూ.6కోట్లు అందించినట్టు తెలిపారు. చిరు వ్యాపారులకు ముద్ర లోన్లు రూ.13 లక్షలు ఇప్పించామన్నారు. వీధి వ్యాపారులకు 430 మందికి రుణాలు బ్యాంకుల ద్వారా ఇప్పించ్చామన్నారు. మహిళలు, వీధి వ్యాపారులు, చిరు వ్యాపారం చేసుకునే వారికి యూసీడీ అండగా ఉంటూ వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. తమ సర్కిల్లో 25 మంది ఆర్పీలు ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాల్లో కంటి వెలుగు, ప్రజలకు వివిధ కార్యక్రమాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలకు వీరిని భాగస్వామ్యం చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. తమ సర్కిల్లో 850 మహిళా పొదుపు సంఘాలు ఉన్నట్టు తెలిపారు.