Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో/సుల్తాన్‌బజార్
హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభయాత్ర ప్రశాంతంగా జరిగింది. శోభయాత్ర నేపథ్యంలో నగర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 15 వందల మంది పోలీసులు విధులు నిర్వహించారు. శోభాయాత్ర మార్గంలో సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఉంచారు. యాత్ర సాగుతున్న ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు.
మంగళ్‌హాట్ డివిజన్లోని సీతారాంబాగ్ రామాలయం నుంచి మధ్యాహ్నం శోభాయాత్ర ప్రారంభమైంది. సీతారాంబాగ్ ఆలయం-బోయగూడ కమాన్ నుంచి మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ రోడ్డు, జాలి హనుమాన్, ధూల్‌పేట, పురానాపూల్, జుమేరాత్ బజార్, చుడిబజార్, బేగంబజార్ చత్రి, బర్తన్ బజార్, సిద్దంబర్ బజార్ మసీదు, శంకర్ షేర్ హౌటల్, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుత్లిబౌలి చౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాల వరకు యాత్ర కొనసాగింది. ఎలాంటి అవాఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ నుంచి సీపీ సీవీ ఆనంద్ శోభయాత్రను క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడి నుంచే సిబ్బందికి కావాల్సి సూచనలు, సలహాలను అందించారు. శోభయాత్ర ప్రశాంతవాతావరణంలో పూర్తి చేసేందుకు సీపీ అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో ర్యాలీ ప్రశాంతంగా ముగిసింది. దాంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.