Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
కేంద్ర ప్రభుత్వం బీసీల బడ్జెట్ రూ.రెండు లక్షల కోట్లకు పెంచాలని ఏప్రిల్ 3, 4వ తేదీన తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి మద్దతు తెలిపాల్సిందిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీసీ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ టి.రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 50శాతం రిజర్వే షన్లు కల్పించాలి డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పారీ ్టలు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయన్నారు. రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా 75 ఏండ్లుగా అన్యా యం చేస్తున్నారని చెప్పారు. జెండాలు మోసుకుంటూ, జిందాబాద్ నినాదాలు ఇస్తూ బీసీలను వాడుకుంటున్నారని తెలిపారు. బీసీల విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను 25 శాతం నుంచి 50 శాతం పెంచాలనీ, కేంద్రంలో బీసీలకు ప్రతేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి రూ.2 లక్షల కోట్లతో ప్రతేక అభివృద్ధి పథకం ప్రకటిం చాలని డిమాండ్ చేశారు. హై కోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల నియమాకంలో, ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు ప్రవేశ పెట్టాలన్నారు. బీసీల న్యాయమైన డిమాండ్ సాధన కోసం పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన జరపాలని రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య పిలుపు మేరకు బీసీ నాయకులు భారీ స్థాయిలో హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు భూపేష్ సాగర్, ప్రధాన కార్యదర్శులు నందగోపాల్, కే.రాము, ఇతర తదితరులు పాల్గొన్నారు.