Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వయోవృద్ధులకు పెద్ద కొడుకు సీఎం కేసీఆర్
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- జల్పల్లిలో ఆత్మీయ సమ్మేళన సభ
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం జల్ పల్లి మున్సిపల్ పరిధిలోని శ్రీరాంనగర్ కాలనీలో కౌన్సిలర్ పల్లపు శంకర్ అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో వయోవృ ద్ధులకు రూ. 2 వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్న పెద్దకొడుకుగా కేసీఆర్ అని వర్ణించారు. రాష్ట్రంలో పేద ప్రజల కోసం అవలం బిస్తున్న సంక్షేమ పథకాలు, మిషన్ భగీరథ, చెరు వుల సుందరీ కరణ అక్కడితో ఆగకుండా కంటి వెలుగు ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చిన మహనీయుడు కేసీఆర్ అని కొనియా డారు. మహేశ్వరం నియోజకవర్గానికి కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేయగా అన్ని ప్రాంతాలలో కూడా అభివృద్ధి కార్యక్ర మాలు జరుగుతున్నాయన్నారు. ఒకప్పుడు జల్ పల్లి మున్సిపల్ టికీ రావాలంటే ఎంతో ఇబ్బందిగా ఉండేదని, ప్రస్తుతం ప్రజల సౌకర్యం కోసం సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం, పక్కా డ్రయినేజీ వ్యవస్థ,మిషన్ భగీరథ పథకంలో మంచినీటి వ్యవస్థ,వీది దీపాలు ఏర్పాటు చేసుకో వడం జరిగిందన్నారు.ఇంకా కొన్ని ప్రాంతాలలో పనులు జరగా ల్సిందని, దశల వారీగా త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నిరుపేదలైన వారు ప్రభుత్వ స్థలాలలో ఇండ్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం మరోసారి 58,59 జీ ఓ ద్వారా రేగ్యులరైజేషన్ చేసుకో వచ్చని, ఈ అవకాశం వచ్చేనెల ఒకటో తేదీ నుండి అమలులోకి రానుందని, ప్రభుత్వ స్థలాలలో ఇల్లు నిర్మించుకున్న వారు 2020 లోపు ఉన్నవారు అర్జీ పెట్టుకోవాల్సిందిగా మంత్రి తెలిపారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే సీఎ కేసీఆర్ నాయక త్వాన్ని బలపరచాలన్నారు. పార్టీ నియోజకవర్గం మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖైసర్ బాం, బీఆర్ఎస్ కే.వీ.అధ్యక్షులు దామోదర్ రెడ్డి, కౌన్సిలర్లు కే.లక్ష్మినారాయణ, శంశోద్దిన్, బాషమ్మ, కొండల్ యాదవ్, సౌద్ బారు, కోఆప్షన్ సభ్యులు సూరెడ్డి కష్ణారెడ్డి,మాజీ సర్పంచ్ రాములు, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షులు ఎక్బాల్ ఖలీఫా, వర్కింగ్ ప్రెసిడెంట్ వై.జనార్దన్, మాజీ ఎంపీటీసీలు దూడల శ్రీనివాస్ గౌడ్,సీనియర్ నాయకులు సుధాకర్ గౌడ్, యువ నాయకులు అర్జున్, అనుబంధ సంఘాల అధ్యక్షులు, మహిళలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
సరూర్నగర్ : సరూర్ నగర్ డివిజన్ హుడా కాంప్లెక్స్ రామాలయంలో జరిగిన సీతారాముల కళ్యాణం వేడుకల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ మహేశ్వరం నియో జకవర్గం జనరల్ సెక్రెటరీలు బేర బాలకిషన్ (బాలన్న), మురుకుం ట్ల అరవింద్ శర్మ, నాయకులు లోకసాని కొండలరెడ్డి, అశోక్, దేవాలయ కమిటీ సభ్యులు రాజకుమార్ గుప్త, మల్లారెడ్డి, మొరిశెట్టి శ్రీను, అన్నపూర్ణమ్మా, యాదయ్య గుప్తా, నేలకొండ శ్రీనివాస్ రెడ్డి, కంచర్ల శేఖర్, శ్రీమన్నారాయణ, పెంబర్తి శ్రీనివాస్ పాల్గొన్నారు.