Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి
నవతెలంగాణ-సంతోష్ నగర్
చంపాపేట్ డివిజన్ దుర్గా భవాని నగర్ కాలనీలో నెలకొన్న భూగర్భ డ్రయినేజీ, సీసీ రోడ్ల సమస్యలను అధికా రులతో కలసి స్థానిక కార్పొరేటర్ వంగా మదుసుదన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుర్గాభవాన్ని నగర్ కాలనీ రోడ్ నెంబర్ 7లో ప్రస్తుతం డ్రయినేజీ 4 అడుగుల పైపు లైన్లు ఉన్నవని, అందుకే తరచూ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ప్రస్తుతం పెరిగిన జనాభాకు అనుగుణంగా 8 అడుగుల పైపు లైన్లకు ప్రణాళిక సిద్దం చేసి పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కాలనీలో నెలకొన్న సీసీ రోడ్ల సమస్య కాలనీ వాసులు ఆయన దష్టికి తీసువచ్చారు. సానుకూలంగా స్పం దించి అట్టి సమస్యను వారంలో ప్రారంభించాలని సంబం ధిత అధికారులకు కార్పొరేటర్ తెలిపారు. డివిజన్ పరిధి లోనే ప్రతి కాలనీకి మౌలిక సదుపాయాలు కల్పించి అభివృ ద్ధి చేచడమే తన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఏఈ సురేష్, వర్క్ ఇన్స్పెక్టర్ రాజు, భవాని నగర్ కాలనీ అధ్యక్షులు రమేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు వెంకట్, నాయకులు అంజి, అమిత్, సుమిత్ అభిమానులు కార్యకర్తలు పెద్దలు నాయకులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.