Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కాలడేరాలో బుధవారం 5వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సమావేశానికి స్థానిక డిప్యూటీ ఈవో నెహ్రూ బాబు, సైదాబాద్ మండల డిప్యూటీ ఈవో రాధాకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయాలను ఒక్కొక్క విద్యార్థి వినియోగిం చుకోవాలన్నారు. డిప్యూటీ ఈవో నెహ్రూ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలే కాకుండా సమాజంలో ఉన్న దాతల నుంచి వచ్చే సహకారాన్ని తీసుకోవాలని, ఇలాంటి సహాయాన్ని కాలడేరా పాఠశాల వినియోగించుకోవడంలో ముందుందని చెప్పారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన దింసా, కోలాటం, జానపద గేయాలు, పిల్లల ఉపన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మందడి వెంకట్ రెడ్డి, బాల్ భవన్ సూపరిటెండెంట్ విజయలక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయులు అమ్మాజీ, జయలక్ష్మి, సుజాత, నిర్మల, రేష్మ, హృదయమేరి, మల్లేష్, మానస పాల్గొన్నారు.