Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గట్టు గిరి
నవతెలంగాణ-బడంగ్పేట్
బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న నాదర్ గుల్ గ్రామంలో మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలోని 112 మంది అనాధ మానసిక వికలాంగులకు అమెరికాలోని హౌప్ ఫర్ స్పందన స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో డా.తరల్ షా, డా.భవేష్లు రూ.50వేల వ్యయంతో నిత్యావసర సరుకులను అందజేసినట్లు ఆశ్రమ వ్యవస్థాపకులు అధ్యక్షులు గట్టు గిరి తెలిపారు. హౌప్ ఫర్ స్పందన ఉపాధ్యక్షులు ప్రవాస భారతీయులు కోట లక్ష్మీ నరసింహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకు కో-ఆర్డినేటర్ ఆరికపూడి రఘు సమక్షంలో ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు గిరికి అందించడం జరిగిందన్నారు.