Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
శ్రీరామనవమి సందర్భంగా గురువారం పలు ఆలయాల్లో సీతారాముల కళ్యాణ మహౌత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సందర్శకులు ఇబ్బందులు పడకుండా ఆయా దేవాలయాల కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.
హయత్నగర్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహౌత్సవ నిర్వహణను జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ రామ్ నగర్ కాలనీలో సాయిబాబా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహౌత్సవానికి ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి,సినీ నటి జీవిత రాజశేఖర్లు విచ్చేసి సీతారాముల వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ఘనంగా కళ్యాణం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి యేటా ఎంతో ఘనంగా నిర్వహంచే సీతారాముల కళ్యాణ మహౌత్సవానికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వివిధ కాలనీ వాసులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
హయత్నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో జరిగిన వేడుకల్లో స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పాల్గొన్నారు. వారి వెంట పలు కాలనీ వాసులు ఉన్నారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని లెక్చరర్స్ కాలనీ లో ఉన్న శ్రీ సీతారాముల దేవాలయంలో జరిగిన శ్రీ రామ నవమి వేడుకలలో వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి,హయత్ నగర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తో పాటుగా బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కొసనం ధనలక్ష్మి వెంకట్ రెడ్డిలు పాల్గొన్నారు.
వనస్థలిపురం : వనస్థలిపురం డివిజన్ పరిధిలోని హిల్స్ కాలనీ రామాలయంలో నిర్వహిస్తున్న సీతారాముల కళ్యాణం మహౌత్సవంలో ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చింతల్ రవికుమార్ గుప్తా పాల్గొన్నారు.
గణేష్ టెంపుల్లో ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లతో కళ్యాణాన్ని నిర్వహించి, భక్తులకు ఎలాంటి ఆటంకం రాకుండా భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. హయత్ నగర్ సెవెన్ మెట్రోపాలిటీ మెజిస్ట్రేట్ మారుతి ప్రసాద్ తో పాటు వనస్థలిపురం సీఐ కే సత్యనారాయణ, ఎస్సైలు స్వామి, మాధవరెడ్డి, ఆలయ కమిటీ చైర్మెన్ అశోక్ కుమార్ గౌడ్, వైస్ చైర్మెన్లు మిట్ట రామ్మో హన్, కంచి కష్ణమోహన్, జనరల్ సెక్రెటరీ డాక్టర్ ప్రభాకర్, సురేష్, బాలేశ్వర్, బ్రహ్మచారి, పురోహితులు కృష్ణ మూర్తి, పురుషో త్తమా చారి, లక్ష్మణ చారి తదితరులు పాల్గొన్నారు.
హిల్స్ కాలనీలోని రామాలయంలో ఆలయ కమిటీ సభ్యులు కళ్యాణోత్సవం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మెన్ దంపతులతో పాటు బీఆర్ఎస్ వనస్థలిపురం అధ్యక్షుడు చింతల రవికుమార్ గుప్తా దంపతులు, హయత్ నగర్ మెట్రోపాలిటీ మెజిస్ట్రేట్ మారుతి ప్రసాద్ దంపతులు పాల్గొన్నారు.
సరూర్నగర్ : ఆర్కే పురం డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల వారి కళ్యాణం కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుక ుంట్ల అరవింద్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు వజ్రాల సంజీవరెడ్డి, చైర్మెన్ పైల సంజీవరెడ్డి, కన్వీనర్ ఏ మహేందర్, వైస్ చైర్మెన్ పుష్పలత రెడ్డి, కో కన్వీనర్ మురళీధర్ రెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు ఊర్మిల రెడ్డి, నాయకులు జగన్ మోహన్ రెడ్డి, చామల శైలజ, శ్రీనివాస్ రెడ్డి, గొడుగు శ్రీనివాస్, పెంబర్తి శ్రీనివాస్, కంచర్ల శేఖర్ పాల్గొన్నారు.
సరూర్ నగర్ బంగారు మైసమ్మ కాశీ వైద్యనాదేశ్వర దేవాలయంలో దేవాలయం ఫౌండర్ ట్రస్టిస్ బేర బాలకిషన్ (బాలన్న ),ఆకుల అరవింద్ కుమార్ ల ఆధ్వర్యంలో సీతా రాముల కళ్యాణం ఘనంగా జరిగింది.మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు శ్రీశైలం యాదవ్, బబ్బురి ఆనంద్ కుమార్ , మీడియా ఇన్చార్జి మొగిళ్ళ మల్లేష్, దేవాలయం అర్చకులు సాయికష్ణ, చంద్రశేఖర్ పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం దేవాల యం కమిటీ వారు అన్నప్రసాదం పంపిణీ చేశారు.
చౌడి విజయ రామాలయంలో శ్రీ సీతారామ కళ్యాణ మహౌత్సవానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. సరూర్నగర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు శంకర్ యాదవ్, విజయ రామాలయం దేవాలయ చైర్మెన్ మహేందర్ యాదవ్, నర్సింగ్ గౌడ్, అంజయ్య, దత్తాత్రి, మీర్ పెట్ కార్పొరేటర్ చల్లా బాల్ రెడ్డి , జిల్లా జనరల్ సెక్రెటరీ ఎరుకల వెంకటేష్ గౌడ్, సుభాష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మీర్పేట్ : మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని వెంకటేశ్వ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనం తరం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పునర్ ప్రతిష్టాపన కార్యక్ర మంలో పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ప్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నేత అర్కల కామేష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, నాయకులు, భక్తులు హాజరయ్యారు.
బడంగ్పేట్ : బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న వివిధ గ్రామాల్లో శ్రీ సీతా రాముల కళ్యాణ మహౌత్సవం వేడుకలుఘనంగా నిర్వహించారు. బడంగ్ పేట్, బాలాపూర్, అల్మాస్ గూడ, నాదర్ గుల్, కుర్మల్ గూడ,గుర్రంగూడ, జల్ పల్లి మున్సిపల్ లోని వివిధ దేవాలయంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కష్ణారెడ్డి, పీసీసీ కార్యదర్శి యేల్మటి అమరేందర్ రెడ్డి, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి,మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇంచార్జి అందెల శ్రీరాములు యాదవ్, ప్రజా ప్రతినిదులు, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.