Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జపాన్ కరాటే అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర చీప్ రాపోలు సుదర్శన్
నవతెలంగాణ-నాచారం
ఆత్మ రక్షణ కోసం కరాటే ప్రతి ఒక్కరికీ అవసరమని జపాన్ కరాటే అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర చీప్ రాపోలు సుదర్శన్ అన్నారు. గురువారం నాచారం డివిజన్ పరిధిలోని ఎర్రకుంట సిడిఎస్ భవన్ లో నిర్వహించిన కరాటే బెస్ట్ బెల్ట్ టెస్ట్ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ దయానందన జీవితంలో ప్రతి ఒక్కరికి కరాటే అవసరమని అన్నారు. ఆరోగ్యం ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కరు కరాటే నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జపాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో కరాటే క్రీడలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు బెల్ట్ టెస్టు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి బెల్టులను సర్టిఫికెట్లను అందజేశారు. అతి తక్కువ ఫీజులతో అందరికీ కరాటే నేర్పించాలనే లక్ష్యంతో జపాన్ కరాటే అసోసియేషన్ గత 20 సంవత్సరాలుగా వందలాదిమంది కరాటే క్రీడలు శిక్షణ అందిస్తున్నట్లు కరాటే మాస్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కరాటే క్రీడలో ప్రతిభ వంతులకు నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో అవకాశాలు కల్పించేందుకు జపాన్ కరాటే అసోసియేషన్ అన్ని విధాల సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ రాజశేఖర్ రెడ్డి, మల్యాల రాజు, చిదురాల యాకస్వామి, రాజు, రామ్ , చరణ్, శ్రీనివాస్, కరాటే క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.