Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారా హిల్స్
ప్రజలకు ప్రభుత్వాలకు ఏ వార్త చిత్రాలను చూపించాలి, ప్రజల ఇబ్బందులు వారి సమస్యల పరిష్క రానికి తన చిత్రాలు దారి చూపించాలనే దృష్టి, నైతిక బాధ్యతను కలిగి ఉన్న సీనియర్ ఫోటోజర్నలిస్టు ఆర్.వి. కోటేశ్వర్ రావును పలువురు ప్రముఖ ఫోటోజర్నలిస్టులు ప్రసంశించారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో న్యూ ఇండియన్ ఏక్ప్రెస్ దిన పత్రిక చీఫ్ ఫోటోజర్నలిస్టు ఆర్.వి.కోటేశ్వర్ రావు ఉద్యోగ విరమణ సభ తెలంగాణ రాష్ట్ర ఫోటోజర్నలిస్టుల సంఘం నిర్వహించింది. ఈ సభకు సాక్షి దిన పత్రిక చీఫ్ ఫోటో జర్నలిస్టు కె.రవికాంత్ రెడ్డి అధ్యక్షత వహించగా ప్రముఖ ఫోటో జర్నలిస్టులు సి.కేశవులు, హెచ్.సతీష్, డి. రవీందర్ రెడ్డి, పి.అనిల్ కుమార్, ఎండి.ఇల్యాస్, తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలి స్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎన్.హరి వేదికపై ఆసీనులై ఆర్.వి.కోటేశ్వర్ రావును శాలువా, ఫూల మాలలు, మెమెంటో అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా సి.కేశవులు మాట్లాడుతూ ఫోటో జర్నలి స్ట్లు వార్తా మాధ్యమానికి సహకరిస్తారనీ, నిజాయితీగా నిష్పక్షపాతంగా నివేదించే చిత్రాల కోసం ప్రయత్నించడం ప్రతి ఫోటో జర్నలిస్ట్ వ్యక్తిగత బాధ్యత గుర్తు చేశారు. హెచ్.సతీష్ మాట్లాడుతూ ఫోటో జర్నలిజం అనేది రిపోర్టింగ్ ఒక రూపం, నీతి ప్రధానమైనది. వాస్తవికంగా ఖచ్చితమైన సమాచారాన్ని అందించాల్సిన అవసరం ఉందనీ, వీటిని ఫోటో జర్నలిస్టులు తెలియజేయడానికి ప్రయత్నించాలని కోరారు. డి.రవీందర్ రెడ్డి మాట్లాడుతూ పదాలు లేకుండా ఫోటోజర్నలిస్టు తీసిన ఒక ఫోటో మొత్తం కథనాన్ని తెలియజేసేలా ఉండాలనీ, ఆర్.వి.కోటే శ్వర్రావు తీసిన చిత్రాలు ప్రజలకు అవగాహన కల్పించే విదంగా ఉండేవన్నారు. కె.రవికాంత్ రెడ్డి భాషా అవరో ధాన్ని అధిగమించి సమాజానికి కథను వివరించే సామర్థ్యం ఫోటో జర్నలిజం గొప్ప ప్రాముఖ్యత అనీ, సమాజంలో ఏమి జరుగుతుందో దృశ్యమానంగా చెప్పే శక్తిని, అద్దంలా పని చేసి సత్యాన్ని చిత్రీకరించే శక్తి ఆర్.వి. కోటేశ్వర్ రావు కు ఉందని తెలిపారు. కె.ఎన్.హరి మాట్లా డుతూ ఆర్.వి.కోటేశ్వర్ రావు సీనియర్ ఫోటోజర్నలిస్టుగా ఉద్యోగ నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు అందరి మెప్పు పొందారని తెలిపారు. ఉద్యోగ విరమణ సమయంలో సుఖ శాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సభలో తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.కిషోర్ సింగ్, పి.రామ్ మూర్తి, సంయుక్త కార్యదర్శి బిహెచ్ఏంకె. గాంధీ, కోశాధికారి కె. అనిల్ కుమార్, కార్యవర్గ సభ్యులు నక్క శ్రీనివాస్, పి.హరికృష్ణ, ఎన్.శివ కుమార్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు హదయానంద్, ఫొటో జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.