Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రముఖ ఫుడ్ రెస్టారెంట్ 'పిస్తా హౌస్' మరో రెస్టారెం ట్ను దిల్‌సుఖ్‌నగర్‌లోని గడ్డిఅన్నారం ఎక్స్ రోడ్డులో ప్రారంభించారు. ఈ రెస్టారెంట్‌ని మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా ప్రారంభించారు. ఈ కార్యక్ర మంలో మలక్ పేట నాయకులు మల్ రెడ్డి, మలక్ పేట కార్పొరేటర్ భాగ్యలక్ష్మి మధుసూదన్ రెడ్డి, సైదాబాద్ కార్పొరేటర్ అరుణ రవీందర్ రెడ్డి, పిస్తా హౌస్ ఫౌండర్ జనాబ్ అబ్దుల్ మజీద్, కెఎస్ కె వెంచర్స్ త్రివిక్రమ్ పాల్గొన్నారు నగరంలోని ఫుడ్ లవర్స్‌కు ఈ రెస్టారెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రుచికరమైన వంటకా లు, బేకర్ ఫుడ్, హలీం రెసిపీలతో నగరవాసులను ఆకట్టు కుంటోన్న రెస్టారెంట్‌కు ఆదరణ బాగానే ఉంది. అలాంటి పిస్తా హౌస్ ఇప్పుడు దిల్సుఖ్నగర్, మలంపేట్ నగర ఆహార ప్రియులకు సరికొత్త అనుభూతినిచ్చేందుకు సిద్ధ మైంది. పిస్తా హౌస్ నిర్వహకులు త్రివిక్రమ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే పేరు పొందిన లార్జెస్ట్ రెస్టారెంట్ పిస్తా హౌస్ గడ్డి అన్నారం ప్రాతంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ వాసులకు ఎంతో ఇష్టంమైన హాలీమ్తో పాటు బిర్యానీ, బేకరీ ఫుడ్ స్పెషల్ బిర్యానీ, వెరైటీ ఫుడ్ ఐటమ్స్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అని తెలిపారు.