Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- సరూర్నగర్, బడంగ్పేట్లలో కల్యాణ లక్ష్మి చెక్కుల అందజేత
నవతెలంగాణ -సరూర్నగర్
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా నిరుపేద బతుకులలో వెలుగులు నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం సరూర్ నగర్ తహసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథిగా హాజరై లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సరూర్నగర్ , ఆర్కే పురం డివిజన్లకు చెందిన 63 మంది లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అహర్నిశలు పేద ప్రజల కోసం ఆలోచిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, ఆర్డీవో సూరజ్, తహాసిల్దార్ జయశ్రీ, ఆర్కే పురం డివిజన్ కార్పొరేటర్, బీఆర్ఎస్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శిలు అరవింద్ శర్మ, బేర బాలకిషన్, నాయకులు రాధా ధీరజ్ రెడ్డి, సరూర్నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ అనిత దయాకర్ రెడ్డి , బీఆర్ఎస్ అధ్యక్షులు మహేందర్ యాదవ్, లోకసాని కొండల్ రెడ్డి, సాజీద్, ఋషి, సలీం, రాఘవేంద్ర గుప్తా, నేలకొండ శ్రీనివాస్ రెడ్డి, శ్రీమన్నారాయణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
బడంగ్పేట్ : బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాల యంలో మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని 75 కల్యా ణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 18 సంత్సరాలు నిండిన ఆడపిల్లల కోసం అమలు చేస్తున్న ఈ పథకంతో బాల్య వివాహాలు నిలిచిపోవడం జరిగిందన్నారు. మిషన్ భగీరథ పథకం కోసం రూ.12వందల కోట్ల రూపాయల నిధులను నియోజక వర్గానికి కోసం మంజూరు చేయడం జరిగిందని, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కోసం రూ. వంద కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. డిప్యూటీ మేయర్ ఇబ్రం శేఖర్, కందుకూరు ఆర్డీఓ లక్ష్మినారాయణ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కష్ణ మోహన్ రెడ్డి,బాలాపూర్ మండల తహశీల్దార్ జనార్దన్ రావు,కార్పొరేటర్లు,కో ఆప్షన్ సభ్యులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.